Share News

Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!

ABN , First Publish Date - 2023-12-01T09:15:33+05:30 IST

Indian woman in US: ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు (Self driving car) ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కొన్నిచోట్ల ఇవి దర్శనిమిస్తున్నాయి. మన దగ్గర ఈ రకం కార్లు పూర్తి స్థాయిలో రోడ్లపై పరుగులు పెట్టడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!

Indian woman in US: ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు (Self driving car) ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కొన్నిచోట్ల ఇవి దర్శనిమిస్తున్నాయి. మన దగ్గర ఈ రకం కార్లు పూర్తి స్థాయిలో రోడ్లపై పరుగులు పెట్టడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, పాశ్చాత్య దేశాలలో ఇప్పటికే ఇవి బాగా ప్రజాదరణ పొందాయి. అమెరికా లాంటి దేశాల్లోనైతే ఇవి సాధారణంగా మారిపోయాయి. అయితే, సెల్ఫ్ డ్రైవింగ్ కారును నడిపే అనుభవం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సినిమా చెప్పినట్లు ఆ ఊహా ఎంత బాగుటుందో కదా. జస్ట్ మనం కారు ఎక్కి ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు.. అదే మన గమ్యస్థానం వద్ద దిగబెట్టేస్తుంది. యూఎస్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అలా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణించిన యువతి తనకు ఎదురైన వింత అనుభవాన్ని వీడియోతో సహా సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social media) వైరల్ అవుతోంది.

NRIs: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..!


నేహా దీపక్ షా (Neha Deepak Shah) అనే యువతి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ అయిన 'వేమో' (Waymo) అనే యాప్ ద్వారా తాను ఈ సెల్ఫ్ డ్రైవింగ్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నానని ఆమె పేర్కొంది. ఈ క్యాబ్ కూడా ఉబెర్ లాగానే పనిచేస్తుందని నేహా చెప్పుకొచ్చింది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు బుక్ చేసిన తర్వాత నేహాను పికప్ చేసుకోవడానికి ఆమె ముందు కారు వచ్చి ఆగింది. దాంతో ఆమె తన మొబైల్‌లోని 'వేమో' యాప్ సహాయంతో దాని డోర్‌లను అన్‌లాక్ చేసి లోపల కూర్చుంది. ఆ తర్వాత కారు లోపల జతచేయబడిన స్క్రీన్ ద్వారా స్టార్ట్‌పై క్లిక్ చేయగానే వాహనం కదలడం మొదైలంది. అలా రైడ్ ప్రారంభమైనప్పుడు.. స్టీరింగ్ వీల్ దానంతట అదే కదలడం కనిపించింది. అదే కారులో ప్యాసింజర్ సీట్లో ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వెనుక సీట్లో ఉండడం మనం వీడియోలో చూడొచ్చు.

Indian Nurse: యెమెన్‍లో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా ప్రియా.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి?

ఇక పోస్ట్‌కు నేహా.. “డ్రైవర్ లేని సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ! భవిష్యత్తులో జరిగేది ఇదే? ఇది మాటల్లో చెప్పలేని అనుభవం. ఇది నా జీవితంలో మరిచిపోలేని చక్కని అనుభవాలలో ఒకటిగా మిగిలిపోతుంది. ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో @waymoలో దీన్ని ప్రయత్నించాను. చాలా అంటే చాలా బాగుంది." అనే లైన్‌ను జత చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. గత నెల 17న షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా 14.3 మిలియన్ల మంది వీక్షించారు. అలాగే వేలాదిగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. 'అద్భుతమై టెక్నాలజీ', 'ఇండియాలో ఎప్పుడు ఇది వస్తుంది', 'ఇది భారత్‌లో పనిచేయదు. ఎందుకంటే మన దగ్గర ట్రాఫిక్ సమస్య', 'ఈ కారు రైడ్‌కు మీకు ఎంత కాస్ట్ అయింది', 'వావ్.. సింప్లీ సూపర్బ్' అని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.

Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!


Updated Date - 2023-12-01T09:16:15+05:30 IST