భార్య కట్నం అందకపోవడంతో.. స్నేహితులను ఇంటికి తీసుకెళ్లిన భర్త.. చివరకు తల్లితో కలిసి చేసిన నిర్వాకం తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-08T16:59:28+05:30 IST

వారిద్దరికీ ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. కట్నం తేవాలంటూ రోజూ భార్యను వేధించేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన అతను.. భార్యను మరింతగా వేధించేవాడు. ఓ రోజు..

భార్య కట్నం అందకపోవడంతో.. స్నేహితులను ఇంటికి తీసుకెళ్లిన భర్త.. చివరకు తల్లితో కలిసి చేసిన నిర్వాకం తెలిస్తే..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికీ ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. కట్నం తేవాలంటూ రోజూ భార్యను వేధించేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన అతను.. భార్యను మరింతగా వేధించేవాడు. ఓ రోజు స్నేహితులతో కలిసి ఫుల్‌గా మందు తాగి ఇంటికి వచ్చిన అతను.. చివరకు చేసిన నిర్వాకం.. స్థానింగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని లిసాడి గేట్ పరిధికి చెందిన గోపి (పేరు మార్చాం) అనే వ్యక్తికి స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతితో (young woman) 5నెలల క్రితం వివాహమైంది. కొన్ని నెలలు సంతోషంగా ఉన్న ఆమెకు భర్త నుంచి ఊహించని విధంగా సమస్యలు వచ్చిపడ్డాయి. కట్నం తేవాలంటూ భార్యను రోజూ చిత్రహింసలకు (Torture) గురిచేసేవాడు. అయినా ఆమె ఓపికగా భరిస్తూ వచ్చింది. ఇటీవల మద్యానికి బానిసైన (Alcoholic) గోపి.. భార్యకు రోజూ నరకం చూపించేవాడు. కొడుకును మందలించాల్సిన తల్లి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.

ఓ మహిళకు విపరీతంగా కడుపునొప్పి.. ఆపరేషన్ చేస్తూ పొట్టలో ఏముందో చూసి నోరెళ్లబెట్టిన డాక్టర్.. భర్తను పిలిచి మరీ..

కోడలిపై దాడి కొడుకు దాడి చేస్తుంటే.. చూస్తూ ఉండేదే తప్ప వారించే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో మరింతగా రెచ్చిపోయిన గోపి.. ఇటీవల దారుణానికి పాల్పడ్డాడు. ఓ రోజు స్నేహితులతో కలిసి ఫుల్‌గా మందు తాగి ఇంటికి వచ్చాడు. స్నేహితులతో భార్యను తప్పుడు చేయాలని (Indecent behavior) ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో తల్లితో కలిసి దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యకు మత్తు మందు ఇచ్చి గుండు కొట్టించాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-02-08T16:59:38+05:30 IST