Cruel Husband: వీడు భర్త కాదు, రాక్షసుడు.. 12 ఏళ్లుగా భార్యను బంధించి.. చివరకు?

ABN , First Publish Date - 2023-08-12T18:18:07+05:30 IST

భర్తే సర్వస్వమని భావించి.. తల్లిదండ్రులతో పాటు అన్ని వదిలేసి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలి? మరీ పువ్వుల్లో పెట్టి రాణిలా చూడాల్సిన అవసరం లేదు. వారికి తగిన గౌరవమిస్తూ..

Cruel Husband: వీడు భర్త కాదు, రాక్షసుడు.. 12 ఏళ్లుగా భార్యను బంధించి.. చివరకు?

భర్తే సర్వస్వమని భావించి.. తల్లిదండ్రులతో పాటు అన్ని వదిలేసి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలి? మరీ పువ్వుల్లో పెట్టి రాణిలా చూడాల్సిన అవసరం లేదు. వారికి తగిన గౌరవమిస్తూ.. ప్రేమగా చూసుకుంటే చాలు.. అందుకు పదింతలు వాళ్లు ప్రేమను పంచుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుగా ఉంటారు. ఒకవేళ సమాజం తిరగబడినా.. భార్య మాత్రం భర్తవైపే నిలబడుతుంది. అదీ భార్యంటే! కానీ.. ఓ రాక్షసుడు ఏం చేశాడో తెలుసా? తన భార్యకు ప్రేమ పంచాల్సింది పోయి, నరకం చూపించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జర్మనీలోని ఫోర్‌బాక్ పట్టడానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. 2011లో తన భార్య (53)ని కిడ్నాప్ చేశాడు. పెళ్లైన కొన్ని సంవత్సరాల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆ వ్యక్తి తన భార్యపై కోపం పెంచుకున్నాడు. క్రమంగా అది ద్వేషంగా మారడంతో.. 2011లో కిడ్నాప్ చేసి, ఒక అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో బంధించాడు. ఇక అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇనప తీగలతో ఆమెను కట్టేసి.. రోజూ కొడుతుండేవాడు. తనని కొట్టొద్దని, చాలా నొప్పిగా ఉందని ఎంత రోధించినా.. అతడు వినిపించుకునేవాడు. ఇంకా ఆమెను కొడుతూ బాధపెట్టేవాడు. ఆమె బట్టలు కూడా విప్పేసి.. సెమీ న్యూడ్ అవతారంలో వదిలేశాడు. జుట్టు పెరగకుండా.. ప్రతీసారి గుండు గీస్తూ వచ్చాడు. సమయానికి భోజనం కూడా పెట్టేవాడు కాదు. ఇలా 12 సంవత్సరాలు ఆమె భర్త చేతిలో నయకయాతన అనుభవించింది.


అయితే.. ఇటీవల ఒక రోజు ఆమె భర్త ‘టార్చర్ రూమ్’లో ఫోన్ వదిలేసి వెళ్లిపోయాడు. అదే అదునుగా భావించి.. ఆమె తన చేతులకి కట్టిన తీగల్ని తెంచుకొని.. మొబైల్ ఫోన్ అందుకుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, తనకు జరిగిన దారుణం గురించి వివరించింది. తానెక్కడున్నానో తెలిదయని చెప్పిన ఆమె.. తన భర్త వివరాల్ని పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆమె తెలిపిన వివరాల ప్రకారం భర్తను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని భార్యను బంధించిన రూమ్ వద్దకు తీసుకెళ్లారు. ఆ రూమ్ తెరవాల్సిందిగా పోలీసులు ఎంత చెప్పినా.. అతడు వినలేదు. దాంతో వాళ్లు తమదైన శైలిలో అతనికి చుక్కలు చూపించడంతో.. ఫైనల్‌గా టార్చర్ రూమ్‌ని ఓపెన్ చేశాడు. ముగ్గురు పోలీసులు లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ బాధితురాలు సెమీ న్యూడ్ స్థితిలో శిరోముండనంతో కనిపించింది.

బాధితురాలు పరిస్థితి దయనీయంగా ఉండటం చూసి.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమకు ప్రతిరోజూ ఒక మహిళ అరుపులు వినేవని ఇరుగుపొరుగు వారు పేర్కొన్నారు. తమకు అనుమానం వచ్చి ఇంటి యజమానిని ప్రశ్నిస్తే.. తన భార్యకు క్యాన్సర్ ఉందని, ఆ బాధతోనే అరుస్తుంటుందని చెప్పేవాడని తెలిపారు. కానీ.. తామెప్పుడూ ఆ ఇంట్లో మహిళని చూడలేదన్నారు. మరోవైపు.. ఆ టార్చర్ రూమ్‌ని పోలీసులు నిశితంగా పరిశీలించగా, అక్కడ వారికి ఒక నోట్‌బుక్ లభించింది. అందులో నిందితుడు తన భార్యను టార్చర్‌ పెట్టిన విధానాలతో పాటు ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని తెలిసింది. అయితే.. అతనెందుకు ఇంతలా భార్యని టార్చర్ పెట్టాడన్న సంగతి ఇంకా వెలుగులోకి రాలేదు.

Updated Date - 2023-08-12T18:18:07+05:30 IST