ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. చివరకు భర్త, ప్రేమికుడి మాటలతో తలలు పట్టుకున్న గ్రామ పెద్దలు..

ABN , First Publish Date - 2023-01-31T16:52:36+05:30 IST

ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఎంతో సంతోషంగా జీవించేవారు. అయితే అనుకోకుండా భార్య రూపంలో ఆ కుటుంబంలో సమస్యలు వచ్చి పడ్డాయి. భర్తకు తెలీకుండా భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇటీవల అనుకోని విధంగా..

ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. చివరకు భర్త, ప్రేమికుడి మాటలతో తలలు పట్టుకున్న గ్రామ పెద్దలు..
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఎంతో సంతోషంగా జీవించేవారు. అయితే అనుకోకుండా భార్య రూపంలో ఆ కుటుంబంలో సమస్యలు వచ్చి పడ్డాయి. భర్తకు తెలీకుండా భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇటీవల అనుకోని విధంగా ప్రియుడితో పాటూ ఉన్న భార్యను చూసి అతడు షాక్ అయ్యాడు. చివరకు భర్త, ప్రేమికుడి మాటలతో గ్రామ పెద్దలు తలలు పట్టుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) భాగల్‌పూర్ జిల్లా నాథ్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధుసూదన్‌పూర్ పరిధి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. భార్యతో (wife) కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దంపతుల జీవితంలో ఇటీవల విచిత్ర సమస్య వచ్చింది. గ్రామానికి చెందిన మరో యువకుడితో భార్య.. ఐదేళ్లుగా వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగిస్తోంది. ఇన్నాళ్లూ ఈ విషయం భర్తకు తెలీకుండా జాగ్రత్త పడింది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలుస్తూ వచ్చింది. అయితే ఇటీవల భార్య ప్రియుడితో ఉండగా.. భర్త సడన్‌గా ఇంటికి వచ్చాడు.

టీటీఈ చెప్పడంతో ఫ్రీగా ఏసీ బోగీలో కూర్చున్న మహిళ.. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు దగ్గరికి రావడంతో.. ఎవరా అని చూడగా..

ప్రియుడితో అసభ్యకర స్థితిలో (Indecent status) ఉన్న భార్యను చూసి షాక్ అయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య గొడవ (fight) మొదలైంది. వీరి గొడవ గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడ గుమికూడారు. దీంతో చివరకు గ్రామపెద్దలు కలుగుజేసుకుని పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో ఇరువైపు కుటుంబాల అభిప్రాయాలనూ తీసుకున్నారు. ఇంత జరిగాక కూడా భార్యను తన వద్ద ఉంచుకోవడం ఇష్టం లేదని, అయితే పిల్లల కోసం తనతోనే ఉండాలంటూ భార్యను ప్రాథేయపడ్డానని చెప్పాడు. అయినా ప్రియుడే కావాలని భార్య పట్టుబట్టడంతో చివరకు అతడికే ఇచ్చి పెళ్లి చేయాలని భర్త సూచించాడు.

మద్యం మత్తులో రాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు.. కాసేపటి తర్వాత ఇంకో ఇద్దరు లోపలికి రావడంతో..

అయితే పరాయి వ్యక్తి భార్యను పెళ్లి చేసుకోవడం తనకూ ఇష్టం లేదంటూ ప్రియుడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో పంచాయితీలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు భార్య మాట్లాడుతూ, తనకు భర్తతో పాటూ ప్రియుడు కూడా కావాలని చెప్పింది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక అంతా తలలు పట్టుకున్నారు. దీంతో చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

పొలం నుంచి కంగారుగా ఇంటికి వచ్చిన భర్త.. గదిలో పడి ఉన్న అపరిచిత వ్యక్తి ఫోన్‌లో భార్య వీడియోలు చూసి..

Updated Date - 2023-01-31T16:52:44+05:30 IST