Share News

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ఎవరైనా ప్లాన్ చేస్తారా.. పెళ్లి మంటపంలో వీడియో ప్లే చేయడంతో.. అతిథులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి..

ABN , First Publish Date - 2023-11-03T16:03:26+05:30 IST

వివాహాల నిర్వహణ తీరులో ఒకప్పటికి, ప్రస్తుతానికి ఎన్నో మార్పులొచ్చాయి. గతంలో కేవలం సినిమాల్లో చూసే పెళ్లిళ్లను.. ప్రస్తుతం నిజ జీవితంలోనూ చూస్తున్నాం. కొన్నిసార్లు సినిమా పెళ్లిళ్లను మించిన రీతిలో నిజ జీవిత వివాహాలు జరుగుతున్నాయి. మంటపంలోకి వధూవరుల ఎంట్రీ..

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ఎవరైనా ప్లాన్ చేస్తారా.. పెళ్లి మంటపంలో వీడియో ప్లే చేయడంతో.. అతిథులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి..

వివాహాల నిర్వహణ తీరులో ఒకప్పటికి, ప్రస్తుతానికి ఎన్నో మార్పులొచ్చాయి. గతంలో కేవలం సినిమాల్లో చూసే పెళ్లిళ్లను.. ప్రస్తుతం నిజ జీవితంలోనూ చూస్తున్నాం. కొన్నిసార్లు సినిమా పెళ్లిళ్లను మించిన రీతిలో నిజ జీవిత వివాహాలు జరుగుతున్నాయి. మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి ఘట్టాన్నీ ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పనిలో పనిగా సోషల్ మీడియాను కూడా వేదికగా చేసుకుని పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ఎవరైనా ప్లాన్ చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై కూర్చుని ఉండగా.. ఎదురుగా అతిథులంతా కూర్చుని తిలకిస్తుంటారు. ఈ సమయంలో ఉన్నట్లుండి కెమెరామెన్లు ఓ వీడియోను ప్లే చేస్తారు. అందులో హీరోహీరోయిన్లు ఓ సముద్ర తీరంలో పరుగెడుతుంటారు. ఈ సన్నివేశాన్ని ప్రేరణగా తీసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్‌లో (pre wedding shoot) భాగంగా వధూవరులపై చిత్రీకరిస్తారు. కానీ వధూవరులు పరుగెత్తే విధానం చూసి అతిథులంతా పగలబడి నవ్వుకుంటారు. అలాగే తర్వాత మరికొన్ని సినిమా సీన్లకు.. ఆ సీన్లలో వధూవరులు నటించిన విధానం చూసి అంతా ఎంజాయ్ చేస్తారు.

Wife: రూ.20 వేలు పెట్టి భార్యకు మొబైల్ కొనిచ్చిన భర్త.. వేరే సిటీకి పనికెళ్లాక ఫోన్ చేస్తోంటే నో రెస్పాన్స్.. పక్కింటోళ్లకు కాల్ చేస్తే..!

మధ్యలో బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ శివలింగాన్ని పైకి ఎత్తుకునే సీన్ వేసి, పక్కనే వధువును ఎత్తుకున్న వరుడిని చూపిస్తారు. ఈ సీన్ చూడగానే అంతా మరింత ఎంజయా చేస్తూ నవ్వడం కనిపిస్తుంది. వారితో పాటూ వధూవరులు కూడా నవ్వును ఆపుకోలేరు. వధువు వీడియోలో తనని తాను చూసుకుని సిగ్గు పడుతూ ఇబ్బంది పడడం కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రీ వెడ్డింగ్ షూట్.. చాలా ఫన్నీగా ఉందే’’.. అని కొందరు, ‘‘నైస్ కపుల్స్’’.. అని మరికొందరు, ‘‘సూపర్ క్రియేటివిటీ బ్రదర్’’.. అని ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Shocking: మూత్ర విసర్జనకై రోడ్డు పక్కన బైక్‌ను ఆపడమే ఆ ముగ్గురు అన్నాదమ్ముళ్ల తప్పయింది.. వారి ప్రాణం ఎలా పోయిందంటే..!

Updated Date - 2023-11-03T17:26:42+05:30 IST