Share News

Bank Holidays in November: దీపావళి పండుగ రోజే కాదండోయ్.. నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులే..!

ABN , First Publish Date - 2023-11-01T20:28:00+05:30 IST

పండుగలు, ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలు.. బ్యాంకులు తదితరాలకు సెలవులు ప్రకటించడం సర్వసాధారణం. అయితే ప్రధానంగా బ్యాంకుల విషయంలో సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ నెలలో..

Bank Holidays in November: దీపావళి పండుగ రోజే కాదండోయ్.. నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులే..!

పండుగలు, ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలు.. బ్యాంకులు తదితరాలకు సెలవులు ప్రకటించడం సర్వసాధారణం. అయితే ప్రధానంగా బ్యాంకుల విషయంలో సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల విలువైన సమయం వృథా కాకుండా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులు ప్రకటించారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ జాబితాను విడుదల చేసింది. ఏయే రోజుల్లో, ఎందుకు సెలవులు ఇచ్చారనే వివరాల్లోకి వెళితే..

నవంబర్‌లో బ్యాంకుల సెలవు దినాలు..

1. నవంబర్ 1 (బుధవారం) : కన్నడ రాజ్యోత్సవం, కుట్, కర్వా చౌత్ పర్వదినాలను పురస్కరించుకుని.. బెంగళూరు, ఇంఫాల్, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

2. నవంబర్ 5 ఆదివారం కావడంతో సాధారణంగానే బ్యాంకులకు సెలవు.

3. నవంబర్ 10 (శుక్రవారం) : గోవర్ధన పూజ, లక్ష్మీ పూజ, దీపావళి సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

4. నవంబర్ 11 రెండో శనివారం కావడంతో సెలవు ఉంటుంది.

5. నవంబర్ 12 ఆదివారం

6. నవంబర్ 13 (సోమవారం) : గోవర్ధన్ పూజను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

7. నవంబర్ 14 (మంగళవారం) : దీపావళి, విక్రమ సంవత్, లక్ష్మీపూజ సందర్భంగా అహ్మదాబాద్, బెంగళూరు, గ్యాంగ్‌టక్, ముంబై, నాగ్‌పూర్, బేలాపుర్ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

8. నవంబర్ 15 (బుధవారం) : భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా సిమ్లా, లఖ్‌నవూ, ఇంఫాల్, గ్యాంగ్‌టక్, కాన్ఫూర్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

9. నవంబర్ 19 ఆదివారం కావడంతో సెలవు.

10. నవంబర్ 20 (సోమవారం) : ఛత్ పండుగ సందర్భంగా రాంచీ, పట్నా ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

11. నవంబర్ 23 (గురువారం) : సెంగ్‌కుట్ స్నెమ్, ఇగాస్ బగ్వాల్ పండుగల సందర్భంగా షిల్లాంగ్, దేహ్రాదూన్ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

12. నవంబర్ 24 (శుక్రవారం) : లచిత్ దివాస్ సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

13. నవంబర్ 25న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు.

14. నవంబర్ 26 ఆదివారం కావడంతో సెలవు.

15. నవంబర్ 27 (సోమవారం) : గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇంఫాల్, కోచి, పనాజీ, పట్నా, త్రివేండ్రం, షిల్లాంగ్ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 30న కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నా.. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదనే విషయం గమనించాలి. అదేవింగా యూపీఐ, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు విధిగా వెళ్లాల్సి ఉన్న వారు పై సెలవులను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడం ఉత్తమం.

Updated Date - 2023-11-01T20:29:56+05:30 IST