అత్తారింట్లో అల్లుడి హైడ్రామా.. పుట్టింటికి వెళ్లి తిరిగి రానంటున్న భార్య కోసం ఆ భర్త ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2023-01-19T17:14:48+05:30 IST

భర్తలపై విసుగొచ్చిన సమయంలో భార్యలు పుట్టింటికి వెళ్లిపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్లు పోయాక మళ్లీ సర్దుకుపోతుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు మాత్రం సమస్యలు చాలా పెద్దవి అవుతుంటాయి. కొన్నిసార్లు..

అత్తారింట్లో అల్లుడి హైడ్రామా.. పుట్టింటికి వెళ్లి తిరిగి రానంటున్న భార్య కోసం ఆ భర్త ఎంతకు తెగించాడంటే..

భర్తలపై విసుగొచ్చిన సమయంలో భార్యలు పుట్టింటికి వెళ్లిపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్లు పోయాక మళ్లీ సర్దుకుపోతుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు మాత్రం సమస్యలు చాలా పెద్దవి అవుతుంటాయి. కొన్నిసార్లు దంపతులు విడిపోయే పరిస్థితి వస్తుంటుంది. మధ్యప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పుట్టింటికి వెళ్లి తిరిగి రానంటున్న భార్య కోసం భర్త చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అత్తారింటికి వెళ్లి హైడ్రామా సృష్టించాడు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: వామ్మో.. ఇది నిజమేనా..? తలను మాత్రమే వెనక్కు తిప్పి మరీ ఏం చేస్తున్నాడో మీరే చూడండి..!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్పూర్ పరిధి శాంతినగర్‌కు చెందిన కృష్ణకుమార్ ఘరియా అనే వ్యక్తికి ఏడాది క్రితం ఇదే ప్రాంతానికి చెందిన పూజ అనే యువతితో (marriage) వివాహమైంది. కృష్ణకుమార్.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వివాహానంతరం కొన్ని నెలలు సంతోషంగా ఉన్న వీరి మధ్య ఇటీవల సమస్యలు తలెత్తాయి. కృష్ణకుమార్.. మద్యానికి బానిసవడంతో (Alcoholic) దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. మద్యం అలవాటు మానుకోవాలని భార్య పదే పదే సూచిస్తూ వచ్చింది. అయినా భర్త మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ (quarrels) పడేవాడు. దీంతో చివరకు విసిగిపోయిన పూజ.. పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కృష్ణకుమార్ ఇల్లు, పూజ పుట్టిళ్లు సమీపంలోనే ఉండడంతో రోజూ అత్తగారింటికి వెళ్లి.. తనతో రావాలని పిలిచేవాడు.

Viral Video: ఇది మరీ దారుణం.. ఓ వైపు బైక్‌పై వెళ్తూ.. మరోవైపు అందరి ముందూ ఈ ప్రేమికులు చేస్తున్న పనులు చూడండి..

అయినా పూజ మాత్రం రానంటూ తెగేసి చెప్పింది. ఇకపై మద్యం అలవాటు మానుకుంటానని చెప్పినా పూజ మాత్రం వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్టకుమార్.. బుధవారం సాయంత్రం మరోసారి అత్తగారింటికి వెళ్లాడు. భార్య లేకుండా జీవించలేనంటూ నేరుగా వంట గదిలోకి వెళ్లి, గ్యాస్ సిలిండర్ పైపును పీకేసి.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో స్థానికులంతా అక్కడ గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకుని, తలుపులు తీయాలంటూ సూచించారు. అయినా అతను తెరవకపోవడంతో చివరకు గోడ బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. సిలిండర్ నాబ్ తెరవడంతో ఇల్లంతా గ్యాస్ లీకయింది. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Viral Video: ఫొటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కాడు.. తర్వాత ఏమైందంటే..

Updated Date - 2023-01-19T17:18:23+05:30 IST