30 ఏళ్లుగా అదే పాడు పని.. 10 వేల మంది మహిళలు స్నానాలు చేస్తుండగా ఫొటోలు తీసి వెబ్‌సైట్లకు అమ్మేశాడు..!

ABN , First Publish Date - 2023-02-16T16:49:28+05:30 IST

వీడియో (Videos)ల్లో కనీసం 10 వేల మంది మహిళలు ఉన్నట్లు అనుమానించారు. ఈ వీడియోలను పలు వెబ్‌సైట్లకు విక్రయించినట్లు

30 ఏళ్లుగా అదే పాడు పని.. 10 వేల మంది మహిళలు స్నానాలు చేస్తుండగా ఫొటోలు తీసి వెబ్‌సైట్లకు అమ్మేశాడు..!
30 ఏళ్ల పాటు ఎలా చేయగలిగాడంటే..

స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారంటారు పెద్దలు. అదొక అందమైన ప్రాంతం. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం. నీళ్లతో పాటూ అక్కడ అన్నీ ప్రత్యేకమే. పైగా ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతం. అలాంటిది అక్కడ అలా జరగడం చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. ఒక్కరోజు.. రెండ్రోజులు కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు చేసిన నిర్వాకంతో నిశ్చేష్టులయ్యారు. ఎట్టకేలకు పాపం పండింది. చివరికి ఏం జరిగిందంటే...

జపాన్‌ (Japan) లోని టోక్యో (Tokyo)లో అదొక అందమైన పర్యాటక కేంద్రం (Tourist center). సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం (waterfall). వేడినీళ్లు ఇక్కడ ప్రత్యేకం. ఇది కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకం. మగవాళ్లకు ఎలాంటి అనుమతీ ఉండదు. దీంతో కేవలం ఆడవాళ్లు మాత్రమే వచ్చి స్నానాలు చేస్తుంటారు. ఇక వారాంతపు సెలవులు వచ్చాయంటే చాలా మంది యువతలు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడికొచ్చి జలకాలు ఆడుతుంటారు. పైగా ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతం. దీంతో ఎలాంటి భయం.. ఆందోళన లేకుండా ధైర్యంగా స్నానాలు చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఓ వ్యక్తి రహస్యంగా ఫొటోలు (Photos) తీస్తున్నాడని.. పోలీసులు ఆలస్యంగా తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

ఇది కూడా చదవండి: చేతిలో డబ్బు లేక బిడ్డ మృతదేహాన్ని 120 కి.మీ మేర...

కరిన్ సైటో అనే వ్యక్తి చుట్టు పక్కల ఉన్న కొండ ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల (cameras)తో మహిళలను చిత్రీకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇలా 30 ఏళ్ల పాటు ఎలాంటి అనుమానం రాకుండా చేయగలిగాడు. ఇలా ఫొటోల్లో, వీడియో (Videos)ల్లో కనీసం 10 వేల మంది మహిళలు ఉన్నట్లు అనుమానించారు. ఈ వీడియోలను పలు వెబ్‌సైట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇతగాడికి దాదాపు 16 మంది సాయం చేసేవారని కూడా తెలుసుకున్నారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్థులంతా విద్యావంతులు కావడం గమనార్హం. అధునాతన కెమెరాల ద్వారా ఈ ఫొటోలు, వీడియోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అప్‌లోడ్ చేసిన వెబ్‌సైట్ల (Websites) నుంచి వాటిని తొలగించారు.

ఇది కూడా చదవండి: అనారోగ్యంతో భర్త చనిపోయాడని ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. ఏ రోగం లేకపోయినా ఎలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2023-02-16T16:49:29+05:30 IST