చేతిలో డబ్బు లేక బిడ్డ మృతదేహాన్ని 120 కి.మీ మేర...

ABN , First Publish Date - 2023-02-16T16:08:30+05:30 IST

ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీపై పెట్టుకుని పాడేరు వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం

చేతిలో డబ్బు లేక బిడ్డ మృతదేహాన్ని 120 కి.మీ మేర...
హృదయవిదారకరమైన సంఘటన

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో మరో హృదయవిదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లే స్తోమత లేక స్కూటీపై 120 కిలోమీటర్లు తీసుకెళ్లిన దుర్ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కేజీహెచ్‌ (KGH) లో చనిపోయిన బిడ్డ (dead body) ను తీసుకెళ్తేందుకు ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులు.. అంబులెన్స్ (Ambulance) ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. కానీ ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనికరపడలేదు. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీ (scooty పై పెట్టుకుని పాడేరు (Paderu) వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఆస్పత్రి సిబ్బంది.. పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఇది కూడా చదవండి: అనారోగ్యంతో భర్త చనిపోయాడని ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. ఏ రోగం లేకపోయినా ఎలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2023-02-16T16:11:15+05:30 IST