Wife-Husband: జీవితాంతం గుర్తుండే బర్త్‌డే గిఫ్ట్‌ను పంపిస్తున్నానన్న భర్త.. కొద్ది నిమిషాలకే మళ్లీ భార్యకు ఫోన్.. తీరా చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-27T20:15:49+05:30 IST

తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా.. విధి లేని పరిస్థితుల్లో అంగీకరించారు. వివాహానతంరం కొడుకు, కోడలు అన్యోన్యంగా ఉండడం చూసి ఎంతో ఆనందించారు. తమ కొడుకు తీసుకున్న నిర్ణయం సరైనదని సంతోషించేవారు. అయితే...

Wife-Husband: జీవితాంతం గుర్తుండే బర్త్‌డే గిఫ్ట్‌ను పంపిస్తున్నానన్న భర్త.. కొద్ది నిమిషాలకే మళ్లీ భార్యకు ఫోన్.. తీరా చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా.. విధి లేని పరిస్థితుల్లో అంగీకరించారు. వివాహానతంరం కొడుకు, కోడలు అన్యోన్యంగా ఉండడం చూసి ఎంతో ఆనందించారు. తమ కొడుకు తీసుకున్న నిర్ణయం సరైనదని సంతోషించేవారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కోడలు పుట్టిన రోజున కొడుకు ఆమెకు ఫోన్ చేశాడు. జీవితాంతం గుర్తుండే బర్త్ డే గిఫ్ట్‌ను పంపిస్తున్నానన్న అతను చివరికి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

యూపీకి (Uttar Pradesh) చెందిన మహేంద్ర పాల్ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా జైపూర్ వచ్చి స్థిరపడ్డాడు. ఇతడి కుమారుడు యోగేష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. యోగేష్‌ నాలుగేళ్ల క్రితం యూపీకి చెందిన నిషా శర్మను (love marriage) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిషా శర్మ కుటుంబం కూడా చాలా ఏళ్లుగా జైపూర్‌లోనే ఉంటోంది. అయితే యోగేష్, నిషా శర్మలు వివాహమైన కొన్నాళ్లు బాగానే ఉన్నారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నిషా శర్మతో పాటూ తన తల్లిదండ్రులు కూడా నిత్యం యోగేష్‌ను అవమానిస్తూ ఉండేవారు. పెద్దలు కలుగజేసుకుని పంచాయితీ చేసినా, కొన్నాళ్ల తర్వాత గొడవలు (quarrels) జరుగుతూ ఉండేవి. దీంతో యోగేష్ కొన్నాళ్లుగా తీవ్ర మనస్థాపానికి గురవుతూ వస్తున్నాడు.

Snakes: ఈ రెండు పాములు పగబట్టాయా..? 3 రోజుల క్రితం ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలను కాటేసి చంపిన ఈ సర్పాలే.. మళ్లీ ఇప్పుడు..!

543.jpg

ఇటీవల నిషా శర్మ కుటుంబం వేధింపులు ఎక్కువయ్యాయి. చివరకు ఈ సమస్య ఎంతవరకూ వచ్చిందంటే.. ‘‘రూ.15లక్షలు ఇస్తే మీ కొడుక్కు విడాకులు ఇస్తాం’’.. అని చెప్పే వరకూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం యోగేష్‌కు కొడుకు పుట్టాడు. దీంతో దంపతులు మధ్య గొడవలు సర్దుకుంటాయని అతడి తల్లిదండ్రులతో పాటూ చుట్టుపక్కల వారంతా భావించారు. కానీ నిషా శర్మ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. రోజూరోజుకూ భర్తను వేధించడం తప్ప ఒకరోజు కూడా ప్రేమగా చూసుకునేది కాదు. భార్యలో ఇక మార్పు రాదని గ్రహించిన యోగేష్.. చివరికి తన జీవితాన్నే ముగించాలని నిర్ణయించుకున్నాడు.

Stomach Operation: 3 గంటల పాటు ఆపరేషన్.. 40 ఏళ్ల వ్యక్తి కడుపులోంచి డాక్టర్లు బయటకు తీసిన వస్తువులివే..!

సెప్టెంబర్ 5న తన పుట్టిన రోజు కావడంతో నిషా తన కొడుకును తీసుకుని పెహార్ అనే ప్రాంతానికి వెళ్లింది. అదే రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన యోగేష్.. భార్యకు ఫోన్ చేసి.. జీవితాంతం గుర్తుండే బర్త్ డే గిఫ్ట్‌ను పంపిస్తా.. అని చెప్పాడు. కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి ‘‘మరికొద్ది సేపట్లో నీ బహుమతి అందిస్తా’’.. అని చెప్పి (man committed suicide by drinking poison) విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యోగేష్ మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిషా, ఆమె తల్లిదండ్రులు, సోదరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Bride: వరుడి ఇంటికి చేరిన వధువు.. కాబోయే భర్తను మొదటిసారి చూసిన ఆమెకు షాక్.. పెళ్లిని ఎలాగైనా ఆపాలని పక్కా స్కెచ్..!

Updated Date - 2023-09-27T20:15:49+05:30 IST