7 Big Changes: అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే కొత్త రూల్స్.. ఏకంగా 7 కీలక మార్పులు.. ఏఏ ధరలు పెరగబోతున్నాయంటే..!

ABN , First Publish Date - 2023-09-26T21:43:30+05:30 IST

ఒకటో తారీఖు వస్తోందంటే.. సగటు మధ్య తరగతి మనిషికి ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన కలుగుతుంటాయి. చిన్న పాటి ఉద్యోగాలు మొదలుకొని.. ఓ మోస్తరు జాబ్‍‌లు చేసే వారంతా ఒకటో తేదీన తమ ఇంటి బడ్జెట్‌కు సంబంధించిన లెక్కలు సరిచూసుకుంటూ ఉంటారు. అలాగే..

7 Big Changes: అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే కొత్త రూల్స్.. ఏకంగా 7 కీలక మార్పులు.. ఏఏ ధరలు పెరగబోతున్నాయంటే..!

ఒకటో తారీఖు వస్తోందంటే.. సగటు మధ్య తరగతి మనిషికి ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన కలుగుతుంటాయి. చిన్న పాటి ఉద్యోగాలు మొదలుకొని.. ఓ మోస్తరు జాబ్‍‌లు చేసే వారంతా ఒకటో తేదీన తమ ఇంటి బడ్జెట్‌కు సంబంధించిన లెక్కలు సరిచూసుకుంటూ ఉంటారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రక్రియలో కూడా ప్రతి నెలా ఒకటో తారీఖున వివిధ రకాల మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. అక్టోబర్ 1వ తేదీ దగ్గరపడుతున్న సందర్భంగా కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఏడు 7అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

  1. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున వివిధ అంశాలకు సంబంధించిన పలు మార్పులు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని మార్పులను ముందే తెలుసుకోవడం ద్వారా జరగబోయే నష్టాల నుంచి బయటపడేందుకు వీలుంటుంది. సెప్టెంబర్ నెల ముగుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అక్టోబర్‌లో జరగనున్న మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించి కీలక మార్పులు జరగనున్నట్లు తెలిసింది.

  2. గ్యాస్ లేనిది పొయ్యి వెలగడం కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ 1నుంచి LPG సిలిండర్ ధరల్లో మార్పులు జరగనున్నాయి. దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖున ధరలను క్రమబద్ధీకరించే విషయం అందరికీ తెలిసిందే. ఈ లెక్కన ఈ సారి కూడా CNG-PNG తో పాటూ Aviation Turbine Fuel ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

  3. ఇక వివేశాలకు వెళ్లే వారికి కూడా అక్టోబర్ నెల షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 1నుంచి రూ.7లక్షలకు పైబడిన టూర్ ప్యాకేజీలపై (Tour package) 5శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అంతకంటే ఎక్కువ ప్యాకేజీలపై 20శాతం టీసీఎస్ చెల్లించాల్సి రావచ్చు. కనుక ఈ విషయాన్ని దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ బడ్జెట్‌ని ఓసారి సరిచూసుకోండి.

  4. ప్రస్తుతం చాలా మధ్యతరగతి కుటుంబాల వారు పోస్టు ఆఫీసులో (Post office) పొదుపు ఖాతాలను తెరవడం సర్వసాధారణమైంది. ఇలాంటి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సెప్టెంబర్ 30లోపు PPF, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) పథకాలకు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అక్టోబర్ 1నుంచి ఖాతాలు స్తంభించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు లోపు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడం ఉత్తమం.

  5. మరోవైపు రెండు వేల రూపాయల నోట్లు త్వరలో రద్దవుతాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఎవరి వద్దనైనా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ (RBI) సూచించిన విషయం కూడా అందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 30లోపు రూ.2వేల నోట్లను మార్చుకోవాల్సి ఉంది. లేదంటే అక్టోబర్ 2నుంచి మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లు చెల్లకుండాపోయే ప్రమాదం ఉంది.

  6. అదేవిధంగా ట్రేడింగ్ ఖతా, డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్ (Trading, Demat, Mutual Fund) తదితరాలకు సంబంధించి సెప్టెంబర్ 30 తేదీ లోగా నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సెబీ (Securities and Exchange Board of India) సూచించింది. లేనిపక్షంలో అక్టోబర్ 1నుంచి సదరు ఖాతాలన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధించిన ఇన్వెస్టర్లు ఈ నెలాఖరులోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది.

  7. మరోవైపు వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి కూడా అక్టోబర్ 1నుంచి చాలా మార్పులు రానున్నాయి. పాఠశాల, కళాశాలకు సంబంధించిన అంశాలతో పాటూ ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) , ఆధార్ నమోదు, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలకు దరఖాస్తు చేసుకునే వారికి సర్టిఫికెట్ అవసరం రావొచ్చు. అదేవిధంగా అక్టోబర్‌లో బ్యాంకులకు 16రోజుల సెలవులు ఉన్నాయి. అలాగే ఆయా రాష్ట్రాలను బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉండొచ్చు.

Updated Date - 2023-09-26T21:43:30+05:30 IST