Viral Video: బోటు ఖాళీగా ఉందని ఎక్కాలని చూశారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-09-24T21:44:07+05:30 IST

కొన్నిసార్లు కొన్ని ఘటనలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పలు రకాల ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు..

Viral Video: బోటు ఖాళీగా ఉందని ఎక్కాలని చూశారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

కొన్నిసార్లు కొన్ని ఘటనలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పలు రకాల ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు.. ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. అలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. బోటు ఖాళీగా ఉండడంతో మత్య్సకారులు అందులోకి ఎక్కాలని చూశారు. అయితే చివరకు అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు..

ఇండోనేషియాలోని (Indonesia) వెస్ట్ లాంబాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న సముద్ర (sea) తీరంలో ఇటీవల ఓ రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తీరంలో ఓ బోటు చాలా రోజులుగా నిరుపయోగంగా ఉంది. ఎవరూ వినియోగించకపోవడంతో పాడయింది. అయితే అటుగా వెళ్లి మత్య్సకారులు బోటును తీసుకెళ్దామని అనుకున్నారు. తీరా దగ్గరికి వెళ్లి చూడగా అందులో పెద్ద మొసళ్లు కనిపించడంతో ఖంగుతిన్నారు. మొసళ్లు ఎక్కగానే బోటు (Crocodiles climb into the boat) కూడా అటూ ఇటూ కదలడం కనిపించింది.

Viral Video: అరె! మెట్రోలో టికెట్ లేకుండా ఇలాక్కూడా వెళ్లొచ్చా.. ఈ యూట్యూబర్ ఎలాంటి ప్లాన్ వేశాడో చూడండి..

ఇలా మొసళ్లు చాలా సేపు బోటు పైనే కనిపించడాన్ని వారు ఆసక్తిగా గమనించారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ మొసళ్లు అక్కడికెలా వెళ్లాయి’’.., ‘‘వీటికి బోట్ రైడింగ్ అంటే ఇష్టమున్నట్టుంది’’, ‘‘ఆ పరిస్థితిలో అందులో మనుషులు ఉంటే పరిస్థితి ఏంటో’’, ‘‘నమ్మలేని విధంగా ఉంది’’, ‘‘ఈ మొసళ్లు తేడాగా ఉన్నట్టున్నాయే’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాములతో జాగ్రత్తగా ఉండాలనేది ఇందుకే.. బైక్‌లో వెళ్తున్న ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..

Updated Date - 2023-09-24T21:44:07+05:30 IST