Wedding Gift: హోం థియేటర్ పేలి వరుడు చనిపోయిన కేసులో షాకింగ్ ట్విస్ట్.. పెళ్లిలో ఆ బహుమతిని ఎవరు ఇచ్చారా అని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2023-04-05T14:01:36+05:30 IST

హోం థియేటర్ పేలి నవ వరుడు చనిపోయిన దుర్ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకుని ఖాకీలే ఖంగుతిన్నారు. పెళ్లిలో ఆ బహుమతి ఎవరిచ్చారో అని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Wedding Gift: హోం థియేటర్ పేలి వరుడు చనిపోయిన కేసులో షాకింగ్ ట్విస్ట్.. పెళ్లిలో ఆ బహుమతిని ఎవరు ఇచ్చారా అని ఆరా తీస్తే..
Wedding Gift

హోం థియేటర్ పేలి నవ వరుడు చనిపోయిన దుర్ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకుని ఖాకీలే ఖంగుతిన్నారు. పెళ్లిలో ఆ బహుమతి ఎవరిచ్చారో అని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కబీర్‌ధామ్‌ జిల్లా చమరి గ్రామానికి చెందిన హేమేంద్రకు గత నెల మార్చి 31న మ్యారేజ్ (marriage) జరిగింది. పెళ్లికి బంధువులు.. స్నేహితులు రకరకాలైన గిఫ్ట్‌లు తీసుకొచ్చారు. హడావుడిలో ఓపెన్ చేయడానికి తీరిక లేకపోవడంతో రెండ్రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 2న (ఆదివారం) తెరిచేందుకు ప్రయత్నించాడు. హోం థియేటర్ బహుమతిగా (Wedding Gift) రావడంతో అది ఎలా పని చేస్తుందోనని టెస్టింగ్ చేసేందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అంతే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడికక్కడే నవ వరుడు హేమేంద్ర.. అతని సోదరుడు రాజ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడడమే కాకుండా ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది.

ddd.jpg

సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటనాస్థలిని పరిశీలించారు. అలా పరిశీలిస్తుండగా పేలుడు జరిగిన స్థలంలో గన్‌పౌడర్‌ను గుర్తించారు. దీంతో గిఫ్ట్‌లో బాంబు అమర్చినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఆ బహుమతి ఎవరు తెచ్చారు అన్న కోణంలో పెళ్లి ఫొటోలు, వీడియోలు పరిశీలించగా సంచలన విషయం బయటపడింది. వధువు మాజీ ప్రియుడు సర్జు మార్కమ్‌‌మే ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు. కొత్త దంపతులను చంపాలన్న కుట్రతోనే హోం థియేటర్‌లో బాంబు అమర్చినట్లుగా (home theatre music system explosion) పోలీసులు నిర్ధారించారు. దీంతో మధ్యప్రదేశ్‌కు చెందిన సర్జును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు.

home.jpg

వివాహానికి (marriage) ముందే వధువు, సర్జు మధ్య లవ్ ఎఫైర్ (love) నడిచింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంతలో హేమేంద్రతో పెళ్లి నిశ్చయం కావడంతో ప్రియుడిని యువతి దూరం పెట్టింది. దీంతో ఆమెపై సర్జు పగ పెంచుకున్నాడు. ఎలాగైనా కొత్త జంట చంపాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా హోం థియేటర్‌ను కనుగోలు చేసి అందులో బాంబును అమర్చి బహుమతి అందజేశాడు. నిందితుడు సర్జును మంగళవారం అరెస్ట్ చేసి విచారిస్తే హత్య చేసింది తానేనని అంగీకరించాడు. ఇదిలా ఉంటే నిందితుడికి మరో యువతితో వివాహం కూడా అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకరి మీద పగతో చేసిన ఘాతుకానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోతే.. మరో ఆరుగురు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-05T14:37:44+05:30 IST