Shocking Video: ఓరి దేవుడా.. బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పిన తండ్రి.. చివరికి

ABN , First Publish Date - 2023-08-09T13:48:36+05:30 IST

బ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని న‌డుపుతున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్యమాల్లో (Social Media) తెగ వైర‌ల్ అవుతోంది. ప్రాణాలంటే మరీ ఇంత నిర్లక్ష్యమా? అనేలా ఆ తండ్రి ప్రవర్తన ఉండడం మనం వీడియోలో చూడొచ్చు.

Shocking Video: ఓరి దేవుడా.. బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పిన తండ్రి.. చివరికి

Shocking Video: బ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని న‌డుపుతున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్యమాల్లో (Social Media) తెగ వైర‌ల్ అవుతోంది. ప్రాణాలంటే మరీ ఇంత నిర్లక్ష్యమా? అనేలా ఆ తండ్రి ప్రవర్తన ఉండడం మనం వీడియోలో చూడొచ్చు. వీడియోలో తండ్రి బీరు (Beer) తాగుతుంటే.. 11 ఏళ్ల కుమారుడు ఆ విమానాన్ని న‌డపడం ఉంది. ఈ వీడియో ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురిచేసింది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమాన ప్ర‌మాదం (Plane Crash) లోనే చనిపోయారు. జూలై 29వ తేదీన జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో 42 ఏళ్ల గేర‌న్ మాయా, అత‌ని కొడుకు ఫ్రాన్సిస్‌కో మాయా ప్రాణాలు కోల్పోయారు. అడ‌విలో ఆ విమానం కుప్పకూలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

కాగా, ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న ఈ వీడియో ఆ ప్రమాద ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు తీసిందా? లేదా గ‌తంలో తీసిన వీడియోనా? అన్న విష‌యం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గేరన్ ప్రవర్తన అసలు ఏమాత్రం క్షమించలేనిదని నెటిజన్లు మండిపడుతున్నారు. విమానం గాల్లో ఉండగా డ్రింక్ చేయడమే కాకుండా కుమారుడి చేతికి విమానం నడపమని ఇవ్వడమేంటని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గేరన్ నిర్లక్ష్యమే వారి ప్రాణాలు తీసిందంటూ ఏకి పారేస్తున్నారు.

Viral Video: మాక్ డ్రిల్‌లో పోలీసుపై వ్యక్తి దాడి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?


Updated Date - 2023-08-09T13:49:18+05:30 IST