Viral Video: ఖర్మ ఫలితం అంటే ఇదేనేమో.. బైక్‌పై వెళ్తూ ముగ్గురు కుర్రాళ్లు చేసిన తింగరి చేష్టలకు మరుక్షణంలోనే షాకింగ్ రిజల్ట్..!

ABN , First Publish Date - 2023-03-31T16:48:26+05:30 IST

ఇటీవలి కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బిజీ రోడ్లపై బైక్‌లతో సాహసాలు చేసి వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: ఖర్మ ఫలితం అంటే ఇదేనేమో.. బైక్‌పై వెళ్తూ ముగ్గురు కుర్రాళ్లు చేసిన తింగరి చేష్టలకు మరుక్షణంలోనే షాకింగ్ రిజల్ట్..!

ఇటీవలి కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బిజీ రోడ్లపై బైక్‌లతో సాహసాలు చేసి (Bike Stunt Videos) వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా బైక్ స్టంట్లు చేసే వారు మాత్రం ఆగడం లేదు. తాజాగా ముగ్గురు కుర్రాళ్లు బైక్ స్టంట్ చేసి ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒకే బైక్‌పై ముగ్గురు కుర్రాళ్లు హెల్మెట్ కూడా పెట్టుకోకుండా వెళ్తున్నారు. వెనుక నుంచి ఒకరు వీడియో తీస్తుండగా బైక్ నడుపుతున్న కుర్రాడు స్టంట్ ప్రారంభించాడు. బైక్‌ను అటూ ఇటూ తిప్పుతూ రోడ్డుపై విన్యాసాలు చేశాడు. అయితే ఆ క్రమంలో నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. దాంతో ముగ్గురూ ఎగిరి పడిపోయారు. ఈ వీడియోను @NehaAgarwal_97 అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 30 వేల వ్యూస్ దక్కించుకుంది.

Shocking Tip to Waitress: నేనిచ్చే టిప్ ఇదేనంటూ కస్టమర్ చెప్పింది విని అవాక్కైన యువతి.. రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకెళ్లి మరీ..

కాగా, ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది ఫేక్ వీడియో (Fake Video) అని, ఆ ముగ్గురూ కావాలనే డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయారని, వ్యూస్ కోసం అలాంటి సాహసాలు చేస్తున్నారని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. వారికి కాకపోయినా, అదే రోడ్డుపై వెళ్లే ఇతరులకు మాత్రం ప్రమాదమని పేర్కొన్నారు. అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Viral News: ఈ పాప కాళ్లు మరీ కట్టెపుల్లల్లా ఇంత సన్నగా ఉన్నాయేంటి..? విస్తుపోతున్న నెటిజన్లు.. అసలు కథేంటంటే..

kurnool: వామ్మో.. కర్నూల్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

********************************

Janhvi Kapoor: మాల్దీవుల్లో ఎన్టీఆర్ హీరోయిన్ చిల్.. బికినీ ఫొటోల‌తో హ‌ల్ చ‌ల్‌

Updated Date - 2023-04-02T10:43:03+05:30 IST