Shocking Tip to Waitress: నేనిచ్చే టిప్ ఇదేనంటూ కస్టమర్ చెప్పింది విని అవాక్కైన యువతి.. రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకెళ్లి మరీ..

ABN , First Publish Date - 2023-03-31T15:58:54+05:30 IST

మీకు ``మిస్టర్ బీస్ట్`` (Mr beast) తెలుసా? 24 ఏళ్ల ఈ కుర్రాడు యూట్యూబ్ (Youtube) ప్రపంచంలో మకుటం లేని మహారాజు. ఇతడి యూట్యూబ్ ఛానెల్‌కు ఏకంగా 13.9 కోట్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

Shocking Tip to Waitress: నేనిచ్చే టిప్ ఇదేనంటూ కస్టమర్  చెప్పింది విని అవాక్కైన యువతి.. రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకెళ్లి మరీ..

మీకు ``మిస్టర్ బీస్ట్`` (Mr beast) తెలుసా? 24 ఏళ్ల ఈ కుర్రాడు యూట్యూబ్ (Youtube) ప్రపంచంలో మకుటం లేని మహారాజు. ఇతడి యూట్యూబ్ ఛానెల్‌కు ఏకంగా 13.9 కోట్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అతడి అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్ (Jimmy Donaldson). యూట్యూబ్‌లో అత్యంత భారీగా ఫాలోవర్లను కలిగిన వారిలో తొలి స్థానం ఇతనిదే. తాజాగా బీస్ట్ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్ వెయిటర్‌కు అతడు ఇచ్చిన టిప్‌నకు సంబంధించిన వీడియో అది (Shocking Tip to Waitress).

సోమవారం ఉదయం బీస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో బీస్ట్ ఓ రెస్టారెంట్ వెయిట్రస్‌తో మాట్లాడుతున్నాడు. ``ఇప్పటివరకు నీకు వచ్చిన పెద్ద టిప్ ఎంత`` అని అడిగాడు. దానికి ఆమె 50 డాలర్లు (రూ.4100) అని చెప్పింది. అయితే తాను టిప్‌గా ఓ కారు ఇస్తున్నానని చెప్పాడు. దాంతో ఆ యువతి షాకైంది. అతడు చెబుతోంది నిజమా? లేదా ఫ్రాంక్ ప్లే చేస్తున్నాడా? అనే అయోమయంలో పడింది. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఆమెను బీస్ట్ రెస్టారెంట్ బయటకు తీసుకెళ్లాడు. (Beast Gives New Car As Tip To Waitress)

Virat Kohli SSC Marks: ఆ సబ్జెక్ట్‌లో కోహ్లీ చాలా వీక్ అన్నమాట.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల షీట్..!

తను వచ్చిన కారును ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ సాధించింది. 11 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఆ వీడియోపై ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. ``మీస్టర్ బీస్ట్‌ది చాలా పెద్ద మనసు`` అని, ``ఆ వెయిట్రస్‌ అదృష్టం మామూలుగా లేదు`` అని కామెంట్లు చేస్తున్నారు. బీస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.45 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క వీడియోత బీస్ట్ కోట్ల రూపాయలు సంపాదిస్తాడు.

Updated Date - 2023-03-31T15:58:54+05:30 IST