Viral News: ఈ పాప కాళ్లు మరీ కట్టెపుల్లల్లా ఇంత సన్నగా ఉన్నాయేంటి..? విస్తుపోతున్న నెటిజన్లు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2023-03-31T16:33:56+05:30 IST

ప్రతిరోజూ సోషల్ మీడియాలో కొన్ని వందల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనకు షాక్ కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ చిన్నారి ఫొటో చాలా మందిని అయోమయంలో పడేసింది.

Viral News: ఈ పాప కాళ్లు మరీ కట్టెపుల్లల్లా ఇంత సన్నగా ఉన్నాయేంటి..? విస్తుపోతున్న నెటిజన్లు.. అసలు కథేంటంటే..

ప్రతిరోజూ సోషల్ మీడియాలో కొన్ని వందల సంఖ్యలో ఫొటోలు (Viral Photos), వీడియోలు (Viral Videos) అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనకు షాక్ కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ చిన్నారి ఫొటో చాలా మందిని అయోమయంలో పడేసింది. ఆ పాప కాళ్లు అంత సన్నగా మరీ కట్టెపుల్లల్లా ఉన్నాయేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నాయని తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోతారు. (Shocking Photo)

అవును నిజమే.. మీరు ఆ ఫొటోను పట్టి పట్టి చూస్తే మీరే నిజం తెలుసుకుని షాకవుతారు. నిజానికి ఆ ఫొటోలో పాప కాళ్లు (Girl`s Legs) సన్నగా లేవు. ఆ పాప పట్టుకున్న పాప్‌కార్న ప్యాకెట్ వల్ల మీకు ఆ చిన్నారి కాళ్లు అలా కనిపిస్తున్నాయంతే. @Rainmaker1973 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. Optical Illusionకి సంబంధించిన ఇలాంటి ఫొటోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా ఫొటోలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.

legs1.jpg

పై ఫొటోను తొలిసారి చూసిన చాలా మంది ఆ పాపను చూసి జాలిపడ్డారు. ఆ పాప ఏదో అరుదైన వ్యాధితో బాధపడుతోందనుకున్నారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని షాకయ్యారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Shocking Tip to Waitress: నేనిచ్చే టిప్ ఇదేనంటూ కస్టమర్ చెప్పింది విని అవాక్కైన యువతి.. రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకెళ్లి మరీ..

Updated Date - 2023-03-31T16:33:56+05:30 IST