Health News: హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇవి తినండి

ABN , First Publish Date - 2023-04-10T18:11:07+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా తరుచుగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో హిమోగ్లోబిన్ లోపం(Hemoglobin Deficiency) ఒకటి. హిమోగ్లోబిన్ అనేది మన ఎర్రరక్త కణాల్లో(Red Cells) ఉండేటువంటి ఒక ప్రోటీన్(Protein). ఇది ఆక్సిజన్‌ను మిగిలిన శరీర భాగాలకు మోసుకెళ్తుంది. అంతేకాదు శరీర కణాలనుంచి కార్బన్ డయాక్సైడ్‌ను ఊపిరితిత్తులకు రవాణా చేస్తుంది.

Health News: హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇవి తినండి

ప్రస్తుత జీవనశైలి, విపరీతంగా జెంక్ ఫుడ్స్ తినడం, ఒత్తిడి..ఇవన్నీ మనల్ని అనారోగ్యం పాలు చేయడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తరుచుగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో హిమోగ్లోబిన్ లోపం(Hemoglobin Deficiency) ఒకటి. హిమోగ్లోబిన్ అనేది మన ఎర్రరక్త కణాల్లో(Red Cells) ఉండేటువంటి ఒక ప్రోటీన్(Protein). ఇది ఆక్సిజన్‌ను మిగిలిన శరీర భాగాలకు మోసుకెళ్తుంది. అంతేకాదు శరీర కణాలనుంచి కార్బన్ డయాక్సైడ్‌ను ఊపిరితిత్తులకు రవాణా చేస్తుంది.

మయో క్లినిక్(Mayo Clinic)(నాన్ ఫ్రాఫిట్ అమెరికన్ అకాడమి ఫర్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్) ప్రకారం హిమోగ్లోబిన్ శాతం(Hemoglobin Levels) మగవారిలో 13.5 గ్రాములు/డెసీలీటర్, ఆడవారిలో 12 గ్రాములు/డెసీలీటర్ ఉండాలి. మెడికల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఐరన్ లోపం ఎనిమియా(Iron Deficiency Anaemia), కాలేయ సమస్యలు(Liver Problems), మూత్ర మార్గ సంబంధిత అంటువ్యాధులు(Urinary Tract Infections) తదితర సమస్యలు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడానికి కారణమవుతున్నాయి.

ఇలాంటి సమయంలో బలమైన పోషకాలు ఉన్న ఆహారంలో పదార్థాలు మనం తీసుకుంటే హిమోగ్లోబిన్ పెంచడంలోనూ, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు:

1. బీట్‌రూట్స్(Beetroots)

టేబుల్ బీట్‌, గార్డెన్ బీట్‌ అని కూడా పిలవబడే రెడ్ బీట్‌రూట్స్ అధికంగా పోషకాలను కలిగివున్న కూరగాయలు. బీట్‌రూట్స్ ఒక్క అధికంగా ఐరన్‌(Iron)ను కలిగి వుండటమే కాకుండా పీచుపదార్థం(Fibers), పొటాషియం(Potassium) కూడా ఎక్కువ మోతాదులో కలిగివుంటుంది. అంతేకాదు..ఎర్ర రక్త కణాలను అభివృద్ధి, హిమోగ్లోబిన్‌ను పెంచే B1, B2, B6, B12, C విటమిన్లు(Vitamins) పుష్కలంగా కలిగి వుంటుంది.

2.పాలకూర(Spinach)

అత్యంత శక్తివంతమైన ప్రయోజనాలు కలిగిన ఆకుకూరల్లో పాలకూర ముఖ్యమైనది. దీనితో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ నిరోధకాలైన కెరోటినాయిడ్స్(Carotenoids) లాంటి ఎంటాక్సిడెంట్స్‌(Antioxidants)ను పుష్కలంగా కలిగి వుంటుంది. పాలకూర కంటి సంబంధ వ్యాధులను మనల్ని కాపాడుతుంది.

3.చిక్కుళ్లు(Legumes)

కాయధాన్యాలు(Lentils), బీన్స్(Beans), చిక్‌పీస్(Chickpeas), బఠానీలు(Peas ), సోయా(Soya) వంటి సాధారణ చిక్కుళ్ళు. ఐరన్, మెగ్నీషియం, పోటాషియం వంటి ఆరోగ్యకరమైన పోషకాలు చిక్కుళ్లలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కరిగే గుణం ఉన్న ఫైబర్స్‌ ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేసి శరీరాన్ని ఎప్పుడూ తేలికగా ఉంచుతుంది.

4.రెడ్‌మీట్ (Red Meat)

రెడ్ మీట్‌(Red Meat) అనేది ఒక రకమైన ఎర్రటిమాంసం. మన దేశంలో తక్కువగా వినియోగిస్తుంటారు. ఇది తెల్లటి మాసం కంటే అధికంగా ప్రోటీన్లు, మైయోగ్లోబిన్(Myoglobin) కలిగివుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి దోహదపడే ఐరన్, జింగ్, విటమిన్-బి, అధిక మోతాదులో ప్రోటీన్లను కలిగి వుంటుంది. ఇందులో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. సెలీనియం, పలు రకాల విటమిన్లు, అత్యంత అరుదుగా లభించే హీమ్ ఐరన్ కూడా పుష్కలంగా ఉండే ఆహారం రెడ్ మీట్. రక్తహీనతతో బాధపడుతున్న వారికి, హిమోగ్లోబిన్ మెరుగుపర్చుకోవాలనుకునేవారికి రెడ్ మీట్ ముఖ్యమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-04-10T19:19:30+05:30 IST