Share News

Viral Video: పార్లే-జి బిస్కెట్లతో ఇలాక్కూడా చేయొచ్చా.. ఇతడు చేసిన వినూత్న ప్రయోగం చూడండి..

ABN , Publish Date - Dec 15 , 2023 | 06:01 PM

కొందరు వివిధ రకాల వంటకాలను వినూత్నంగా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. అందరికీ తెలిసిన వస్తువులనే అటూ ఇటూ మార్చి చివరకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేస్తుంటారు. మరికొందరు...

Viral Video:  పార్లే-జి బిస్కెట్లతో ఇలాక్కూడా చేయొచ్చా.. ఇతడు చేసిన వినూత్న ప్రయోగం చూడండి..

కొందరు వివిధ రకాల వంటకాలను వినూత్నంగా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. అందరికీ తెలిసిన వస్తువులనే అటూ ఇటూ మార్చి చివరకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేస్తుంటారు. మరికొందరు కొత్త కొత్త రెసిపీలతో రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తుంటారు. ఇలాంటి వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పార్లే-జి బిస్కెట్లతో ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం చూసి నెటిజన్లు అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పార్లే బిస్కె్ట్లతో (Parle-G Biscuits) వినూత్న వంటకం సిద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం ముందుగా.. ఓ పాన్‌లో నూనె పోసి, అందులో కొన్ని బిస్కెట్లను వేయిస్తాడు. తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్‌గా తయారు చేస్తాడు. తర్వాత మరో పాత్రలో పాల పొడిని వేసి, అందులో కొన్ని పాలు కూడా పోస్తాడు. దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుంటాడు. చివరగా ఓ పాన్‌లో కొన్ని నీళ్లు పోసి, చక్కెర కలుపుతాడు. అందులో పాల మిశ్రమాన్ని జత చేసి, బాగా కలిసేలా మిక్స్ చేస్తాడు.

Viral Video: ఈ పానీపూరీ విక్రేత నెలవారీ ఆదాయం తెలిస్తే.. ఉద్యోగులు కూడా షాక్ అవ్వాల్సిందే..

చివరగా అందులో మిక్స్ చేసి పెట్టుకున్న బిస్కెట్ల పేస్ట్‌ను వేసి, పాలు ఆవిరి అయ్యే వరకూ మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత బిస్కెట్ల మిశ్రమాన్ని ఓ ప్లేట్‌లోకి తీసుకుని, ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాడు. ఇలా పార్లే-జి బిస్కెట్లతో చివరకు వినూత్నమైన స్వీట్‌ను తయారు చేశాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటేనే నోరూరుతోంది’’.. అంటూ కొందరు, ‘‘బిస్కెట్లతో ఇలాక్కూడా చేయొచ్చా’’.. అంటూ మరికొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా... ఇలాంటి ఐడియాలు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Photo: ఇది మీ కంటికి పరీక్ష.. ఇందులో ఎలుక ఎక్కడ దాక్కుందో చెప్పగిలిగితే మీరు నిజంగా గ్రేటే..

Updated Date - Dec 15 , 2023 | 06:01 PM