Viral: బాబోయ్.. ఈ పిల్ల నిజంగా గ్రేటే.. నిండా పదేళ్ల వయసు కూడా లేదు కానీ ఇప్పటికే 50 దేశాలు చుట్టేసింది..!

ABN , First Publish Date - 2023-07-22T14:12:18+05:30 IST

కుదిరితే ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.

Viral: బాబోయ్.. ఈ పిల్ల నిజంగా గ్రేటే.. నిండా పదేళ్ల వయసు కూడా లేదు కానీ ఇప్పటికే 50 దేశాలు చుట్టేసింది..!

ఇంటర్నెట్ డెస్క్: కుదిరితే ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, అది అంత సులువు కాదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఇలా సవాలక్ష కారణాలు వెనక్కి లాగేస్తుంటాయి. కానీ, పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి మాత్రం ఇప్పటికే 50 దేశాలు చూసేసింది. అందులోనూ ఒక్క రోజు కూడా స్కూలుకు సెలవు పెట్టకుండా ఇన్ని దేశాలు వెళ్లొచ్చింది. అవును మీరు విన్నది నిజమే. ఇది వింటే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు.

బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్‌కు చెందిన అదితి త్రిపాఠి తన పేరెంట్స్‌తో కలిసి యాభై దేశాలను సందర్శించింది. యూరోప్లోని చాలా దేశాలను చుట్టేసింది. ఆమెకు మూడేళ్ల వయసున్నప్పటి నుంచి తల్లిదండ్రులు అదితిని మొదటిసారి జర్మనీ తీసుకెళ్లారు. అలా చిన్నారి అంతర్జాతీయ జర్నీ మొదలైంది. ఆ తర్వాత నేపాల్, ఇండియా, సింగపూర్, థాయ్‌లాండ్ ఇలా ఎన్నో దేశాలు పర్యటించింది. కరోనాకు ముందు ఒకే ఏడాదిలో ఈ ఫ్యామిలీ ఏకంగా 12 దేశాలను సందర్శించడం గమనార్హం.

Viral Video: భార్యలు తమ భర్తలకు అస్సలు ఇవ్వనిదేంటి..? ఈ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నకు ఆ కుర్రాడి సమాధానం వింటే..!

Ind.jpg

ఇక దక్షిణ లండన్‌లో ఉండే అదితి పేరెంట్స్ దీపక్ త్రిపాఠి, అవిలాష ఇద్దరూ కూడా బ్యాంక్ ఉద్యోగులు. చిన్నారికి చిన్నప్పటి నుంచి వివిధ ప్రాంతాలను చూపించడం వల్ల సమాజంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయని ఇలా ఆమెను వివిధ దేశాలను చూపిస్తున్నట్లు తండ్రి దీపక్ త్రిపాఠి వెల్లండించారు. అయితే, ఈ పర్యటనల కోసం అదితి ఒక్క రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టలేదట.

ఇదేలా సాధ్యమని అడిగితే దీపక్ చెప్పిన సమాధానం ఏంటంటే.. "ఏ దేశం వెళ్లాలో ముందుగానే అనుకుంటాం. అదితిని శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా టూర్‌కు తీసుకెళ్తాం. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఒక్కోసారి పర్యటన నుంచి ఆలస్యమైతే విమానాశ్రయం నుంచి నేరుగా స్కూల్‌కు వెళ్లిపోతుంది. టూర్లకు ఏడాదికి 20వేల పౌండ్లు (రూ.21లక్షలు) వెచ్చిస్తున్నాం. ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణిస్తాం" అని చెప్పుకొచ్చారు. త్వరలో ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు ఆయన తెలిపారు.

Viral Video: సీన్ రివర్స్.. పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన గేదెలు..!


Updated Date - 2023-07-22T14:12:18+05:30 IST