Viral Video: సీన్ రివర్స్.. పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన గేదెలు..!

ABN , First Publish Date - 2023-07-22T13:21:10+05:30 IST

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఊహించని ఘటన వెలుగు చూసింది.

Viral Video: సీన్ రివర్స్.. పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన గేదెలు..!

Viral Video: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఊహించని ఘటన వెలుగు చూసింది. పులిపై (Tiger) ఓ గేదెల గుంపు మూకుమ్మడిగా (Buffalo Herd) దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొంతకాలంగా ఆ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. గురువారం ఉదయం ఎస్‌ గ్రావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించింది. చేతిలో ఉన్న గొడ్డలితో అతడు ఎదురు తిరగడంతో త్రుటిలో అతడు చావు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ తరువాత పులి బెంబడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై దాడికి యత్నించింది. అయితే, ఊహించని విధంగా గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కొమ్ములతో పొడిచేశాయి. దాంతో పులి తోకముడిచింది. ఇక తీవ్రంగా గాయపడ్డ పులిని అటవీ శాఖ అధికారులు చంద్రపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పులి చనిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట ప్రత్యక్షంకావడంతో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: భార్యలు తమ భర్తలకు అస్సలు ఇవ్వనిదేంటి..? ఈ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నకు ఆ కుర్రాడి సమాధానం వింటే..!


Updated Date - 2023-07-22T13:23:04+05:30 IST