Rajani On CBN : రజనీకాంత్‌పై వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన టీడీపీ.. డైవర్ట్ చేసేశారుగా..!

ABN , First Publish Date - 2023-04-29T14:59:26+05:30 IST

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల (NTR 100 Years Celebrations) అంకురార్పణ సభకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajanikanth) ముఖ్య అతిథిగా హాజరై..

Rajani On CBN : రజనీకాంత్‌పై వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన టీడీపీ.. డైవర్ట్ చేసేశారుగా..!

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల (NTR 100 Years Celebrations) అంకురార్పణ సభకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajanikanth) ముఖ్య అతిథిగా హాజరై.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై (TDP Chief Chandrababu) ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని తలైవా కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్‌-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందని ఆయన చెప్పారు. ఇలా చంద్రబాబును పొగిడారో లేదో గంటల వ్యవధిలోనే వైసీపీ నేతలు మీడియా ముందు వాలిపోయారు. రజనీకాంత్‌పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. అసలు రజనీ ఏం మాట్లాడారు..? ఎలా రియాక్ట్ అవ్వాలి..? అని కనీస ఆలోచన లేకుండానే కొందరు వైసీపీ నేతలు చిల్లర కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. అయితే.. అతిథిగా వచ్చిన ఆయన్ను పట్టుకుని ఇన్నేసి మాటలు అంటారా..? అంటూ టీడీపీ నేతలు.. వైసీపీ నేతలకు దిమ్మతిరిగేలా కౌంటర్లిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani), మంత్రి రోజా (Minister Roja) చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కామెంట్స్‌కు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇంతకీ నాని ఏం మాట్లాడారు..? టీడీపీ (Telugudesam) రియాక్షన్ ఏంటి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Rajanikanth.jpg

రజనీపై నాని ఏం మాట్లాడారు..!?

టీడీపీకి ఎవరు సపోర్టుగా మాట్లాడినా నిమిషాల్లో రియాక్టయ్యే కొడాలి నాని.. చంద్రబాబును రజనీకాంత్ ఆకాశానికెత్తేసినట్లు మాట్లాడేసరికి ఎంత బాధ కలిగిందో తెలియట్లేదు కానీ ఒక్కసారిగా ఊగిపోయారు. తమిళనాడు నుంచి విజయవాడకు వచ్చి చంద్రబాబుపై పొగడ్తలా..? అంటూ నాని ఫైర్ అయ్యారు. ఏపీలో జీరో అయిన రజనీకాంత్.. సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే.. రజనీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ గ్రహించాలి. ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడటం సిగ్గుచేటు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలెవరూ పట్టించుకోరు. ఎన్టీఆర్ బతికుండగా రజని ఏం చేశారు..? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు..?. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే రజనీకాంత్, తెలుగు ప్రజలకు ఏం చెబుతారు..?. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజనీ చదువుతూ మరింత దిగజారుతున్నారు అని కొడాలి నాని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజనీ కామెంట్స్‌కు హుందాగా కౌంటర్ ఇవ్వొచ్చు కానీ.. వ్యక్తిగతంగా మాట్లాడటం అది కూడా షూటింగ్, ఆస్పత్రి అంటూ నాని మాట్లాడటం సొంత పార్టీ నేతలకే రుచించడం లేదట.

రోజా ఏమన్నారో చూడండి..!?

మరోవైపు మంత్రి రోజా కూడా రజనీకాంత్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ జయంతి సభలో రజనీకాంత్ వ్యాఖ్యలు హస్యాస్పదంగా ఉన్నాయి. ఎన్టీఆర్‌ను వెన్ను పోటుపోడిచిన బాబును పొగడటం విడ్డూరం. సభకు పిలిచారు కాబట్టి బాబును పొడిగినట్లుగా ఉంది. ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయం రజనీకాంత్‌కు తెలియదా..?. బాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్‌కు భారతరత్న అంశం గుర్తుకు రాదు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ చావుకు బాబు కారణం. 2013 వరకే బాబు హైదరాబాద్‌కు సీఎంగా ఉన్నారు. 20 ఏళ్ల పాటు బాబు లేకుండానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రజనీకాంత్ గుర్తించాలిఅని తలైవాపై రోజా వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ కౌంటర్ ఇదీ..

రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు. ‘ రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడలేదు. రజనీకాంత్ మీద పడి వైసీపీ నేతలు ఎందుకు ఏడుస్తున్నారు..?. చంద్రబాబు విజన్ గురించి.. ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడితే వైసీపీ నేతలకేమైంది..?. చంద్రబాబు-ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకున్న వాళ్లా మాట్లాడేది..?. వాళ్ల పేర్లు ఎత్తడానికి నేను ఇష్టపడటం లేదు. గతంలో రోజా చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో చూసుకోవాలి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చేసుకుంటే వైసీపీకేంటీ కడుపు మంట..?’ అని సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Somireddy.jpg

చిప్‌లు దొబ్బాయా..!?

మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కూడా స్పందించారు. ‘రజనీకాంత్ మాట్లాడాక ఇంకా వైసీపీ వాళ్లు మాట్లాడలేదేంటా అనుకున్నాం. ఈలోగానే వైసీపీ నేతలు మాట్లాడారు. రజనీకాంత్ మీద ఉదయాన్నే ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి. రజనీకాంత్ మీద విమర్శలు చేశారంటే.. నిన్నటి సభ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ అర్థమైంది. ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు లేరా..? హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర లేదా..?. రోజా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్.. మేథో సంపత్తి గురించి ఇదే రోజా మాట్లాడారు. రజనీకాంత్ పైనా విమర్శలు చేస్తున్నారంటే వైసీపీ భజన బృందం మైండ్ చిప్‌లు దొబ్బాయి. రజనీ ఆరోగ్యం గురించి కూడా వైసీపీ నేతలు మాట్లాడతారా..? వీళ్ల మొహలు మండా..?. రోజా లాంటి చంద్రముఖిలను తొక్కి తొక్కి రజనీకాంత్ బయటకొచ్చారు. బాబాయిని హత్య చేసిన వాళ్లు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడేవారా..?. కొడాలి నాని కడుపుకు అన్నమే తింటున్నారా..?’ అని కొడాలి నాని, రోజాకు అనిత కౌంటరిచ్చారు.

vangalapudi-anitha.jpg

మొత్తానికి చూస్తే.. ఏపీలో హాట్ హాట్‌గా వివేకా హత్య కేసు, వైసీపీ అధిష్టానంపై నేతల అసంతృప్తితో రగిలిపోతున్న టైమ్‌లో ఏపీకి రజనీకాంత్ రావడంతో ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారాలన్నీ డైవర్ట్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీడీపీ నుంచి కూడా ఓ రేంజ్‌లో రియాక్షన్లు వస్తుండటంతో ఇది మరింత హాట్ టాపిక్ అయ్యినట్లయ్యింది. ఇంకో రెండు మూడ్రోజులు రజనీకాంత్ పేరునే వైసీపీ జపం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ నోట ఎలాంటి స్పందన వస్తుందా అని జనాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : అవినాష్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది.. వైఎస్ భారతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది.. కోట్లలో బెట్టింగ్‌లు..!?


******************************

Avinash In Viveka Case : అవినాష్ విషయంలో హైకోర్టు తీర్పుతో వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. హుటాహుటిన సమావేశమై..

******************************

Avinash In Viveka Case : హైకోర్టు తీర్పు తర్వాత సీజే బెంచ్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. తిప్పలు తప్పవా..!?

******************************

Updated Date - 2023-04-29T16:00:04+05:30 IST