Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!

ABN , First Publish Date - 2023-08-15T21:45:10+05:30 IST

యావత్ దేశమంతా మువ్వెన్నల జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని (independence Day) జరుపుకుంది! కులాలు, మతాలకు అతీతంగా భారతీయులు పంద్రాగస్టు (August-15th) పండుగ జరిపారు.! ఆ వర్గం.. ఈ వర్గం అని కాకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అని లేకుండా అన్ని రంగాల వారు పండుగ జరుపుకొని దేశ భక్తిని చాటుకున్నారు.! అయితే ఏపీలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరగడం గమనార్హం.!

Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!

యావత్ దేశమంతా మువ్వెన్నల జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని (independence Day) జరుపుకుంది! కులాలు, మతాలకు అతీతంగా భారతీయులు పంద్రాగస్టు (August-15th) పండుగ జరిపారు.! ఆ వర్గం.. ఈ వర్గం అని కాకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అని లేకుండా అన్ని రంగాల వారు పండుగ జరుపుకొని దేశ భక్తిని చాటుకున్నారు.! అయితే ఏపీలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరగడం గమనార్హం.! స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికార వైసీపీ (YSR Congress) అధికారికంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా రీలీజ్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఫొటో కథేంటి..? ఎందుకింత చర్చ.. రచ్చ అయ్యిందనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Jagan-Janda.jpg

ఇదీ అసలు కథ..!

స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందరి లాగా కాకుండా కాస్త వెరైటీగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలని అధికార వైసీపీ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. వైఎస్ జగన్‌ (YS Jagan), కొందరు స్వాతంత్ర్య ఉద్యమకారులు, సాధారణ ప్రజలతో కూడిన ఒక ఫొటోను వైసీపీ తన అధికార ట్విట్టర్ (YSRCP Twitter) ఖాతా ద్వారా రిలీజ్ చేసింది. సభ్య సమాజానికి ఏదో మెసేజ్ ఇద్దామని వైసీపీ అనుకుంది కానీ.. సీన్ కట్ చేస్తే అడ్డంగా బుక్కయ్యింది. ఇందుకు ఫలితం.. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీలు, ప్రతిపక్ష పార్టీల నుంచి ఓ రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. ఇదిగో ఈ ఫొటోను కాస్త జూమ్ చేసి నిశితంగా పరిశీలిస్తే ఒకటా రెండా.. లెక్కలేనన్ని చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. ఈ చిత్రాలన్నీ చూశాక మీ మనసులో ఇంకెన్ని మెదులుతాయో.. ఏమనుకుంటారో మరి.!. అవన్నీ అటుంచితే.. భారతదేశ పటంలో ఏపీని (AP) వైసీపీ పార్టీ రంగులతో నింపేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇండియా మ్యాప్‌లో.. అది కూడా రాష్ట్రానికి రంగులేయడమేంటి..? అని సోషల్ మీడియాలో నెటిజన్లు, సామాన్యులు, సొంత పార్టీ కార్యకర్తలు సైతం దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని ప్రతిపక్షపార్టీలు కన్నెర్రజేస్తున్నాయి. అంతేకాదు కాస్త జూమ్ చేసి ఈ ఫొటోను చూస్తే మీ కంటికి ఇంకా ఎన్నెన్ని అచ్చు తప్పులు కనిపిస్తాయో..!

YSRCP-August-15th.jpg

మీకే సాధ్యం మహాప్రభో..!

ఇంకాస్త జూమ్ చేసి చూస్తే.. సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎత్తుకొని పాప డ్రస్‌కు కూడా వైసీపీ రంగులు వేయడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీకే తెలియాలి మరి. ఇంకా నయం.. పాపకి మాత్రమే పార్టీ రంగులేశారు.. గాంధీ (Gandhi) గారికి వేయలేదు దేవుడా..? ఇదేగానీ జరిగుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఏమో.!. వైఎస్ జగన్ అందరికంటే ఎత్తులో ఉండటం.. కింది భాగాన మహాత్మాగాంధీ, అంబేద్కర్, అల్లూరి, బాలగంగాధర్ తిలక్ లాంటి మహానుభావులు ఉండటం సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. అంటే.. గొప్ప గొప్ప నాయకులేమో కింద.. ఈయనేమో పైన అన్న మాట. అయితే ఈ రేంజ్‌లో ఫొటో చేసిన వైసీపీకి.. అసలు సిసలైన నేతాజీని మరవడం అధికార పార్టీకే చెల్లుతుందేమో.! అసలు ఇలాంటి ఫొటోతో సభ్య సమాజానికి వైసీపీ ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటుందో జగన్ రెడ్డికే తెలియాలి మరి. ఇవన్నీ కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ‘వైఎస్సార్ దేశంగా’ మార్చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!

Paityam.jpg

తిట్టేస్తున్నారు బాబోయ్..!

వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటోపై నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. వందలాది కామెంట్స్ రాగా ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్టు చేస్తూ రాయలేదు. ‘దేశమంతా మువ్వెన్నల జెండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయ జెండా.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏమైంది..? దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగంగా ఉందా లేదా..?’ అని జగన్ సర్కార్‌ను కొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. చూశారా.. పెద్ద పెద్ద మహానీయుల మధ్య మూర్ఖ ముని అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాత్రూమ్‌లు మొదలుకుని శ్మశానంల వరకూ అన్నింటికీ ఇప్పటి వరకూ రంగులేశారు సరే.. ఆఖరికి ఆగస్టు-15 రోజున కూడా రంగుల పిచ్చి.. మీ బుద్ధి చూపించారుగా అని కొందరు సామాన్యులు సైతం జగన్‌ను విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఈ ఫొటో చూశాక.. ‘ఈ రోజు నన్ను పక్కనే పెట్టుకుని నీ చెత్త రంగుల పిచ్చి చూపుతున్నావంటే ఏం చెప్పాలి దేవుడా.. హరే రామ్’ అని గాంధీ తాత కూడా ఫీలై ఉంటారేమో అని మరికొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఫొటోలో అన్నింటికీ అన్ని చేశారుగా ఇక మిగిలింది తిరంగ జెండా ఒక్కటే కదా..? జెండాకు కూడా పార్టీ రంగులు వేసేసి మూర్ఖత్వాన్ని చాటుకోవాల్సిందని జనాలు వైసీపీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్ని ఆటలు ఆడినా.. ఏం చేసినా ఏదో ఒక విధంగా వైసీపీ నేత్రానందం పడుతోంది కదా.. సో రాసిపెట్టుకోండి ఇదే లాస్ట్ ఆగస్ట్-15 అని వైసీపీకి టీడీపీ, జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. చూశారుగా.. క్రియేటివిటీ ఎక్కువైతే ఫలితం ఎలా ఉంటుందో.. ఇకనైనా అతి మానితే వైసీపీకే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

cm-jagan-cabinet.jpg


ఇవి కూడా చదవండి


Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


TS Assembly Elections 2023 : మంత్రి సబిత- తీగల చెట్టాపట్టాల్.. అరగంట పాటు రహస్య సమావేశం..!


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?


Updated Date - 2023-08-15T21:51:54+05:30 IST