YS Bhaskar Reddy Arrest : తండ్రి అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్ రెడ్డి.. కీలక విషయాలు వదిలి సిల్లీగా...!

ABN , First Publish Date - 2023-04-16T16:22:17+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది...

YS Bhaskar Reddy Arrest : తండ్రి అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్ రెడ్డి.. కీలక విషయాలు వదిలి సిల్లీగా...!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YSRCP MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ తర్వాత పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఉస్మానియా ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడ్నుంచి నేరుగా సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించనున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపై మొదటిసారిగా ఎంపీ అవినాష్ స్పందించారు. తండ్రి అరెస్ట్‌తో హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిన ఎంపీ.. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మళ్లీ పాత విషయాలనే లేవనెత్తుతూ సీబీఐపై ఆరోపణలు చేశారు.

Bhaskar-reddy.jpg

కీలక విషయాలు వదిలేసి..!

వివేకా కేసులో సీబీఐ విచారణ సరిగ్గా జరగట్లేదు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి. నాన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మాట్లాడటానికి మాటలు రావట్లేదు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను ఊహించని విధంగానే అరెస్ట్ చేశారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసింది.. సిల్లీ విషయాలతో వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోంది. హత్య విషయం నాకంటే ముందే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ముందే తెలుసు. హత్యకు సంబంధించి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?. సమాచారం ఇచ్చిన నన్నే దోషి అంటున్నారు. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించడం లేదు. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా మారుస్తారు..? సీబీఐ సహకరించి బెయిల్ ఇప్పించిందిఅని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

MP-Avinash-Reddy-Media.jpg

లెటర్ కథేంటి..!?

వివేకానందరెడ్డి రాసిన లెటర్ అక్కడే ఉంది. లెటర్ దాచిపెట్టమని వివేకా అల్లుడు చెప్పారు. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సమాచారం దాచినా తప్పు కాదు, లెటర్ దాచి పెట్టామన్నా తప్పుకాదు. పోలీసులు రావద్దు అని నేను చెప్పానని అనడం దారుణం. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడు ఉన్నాడు. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు. రెండో భార్యకే ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించిన రౌండ్ సీల్స్, పత్రాలు వివేకా ఇంట్లో దొరికాయి. స్టాంప్ పేపర్లు పోతే ఎందుకు విచారణ జరపడం లేదు. నేను నిజాయితీ నిరూపించుకుంటాను. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విచారణ జరుగుతోంది. ఈ విధంగా విచారణ చేయడం తప్పు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్ పేపర్లు పరిశీలన, దొంగతనం జరిగింది.. ఆ పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు?. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది. మేం చెప్పిన అంశాలను పరిశీలించడం లేదుఅని సీబీఐపై అవినాష్ సంచలన ఆరోపణలే చేశారు.

YS-Viveka.jpg******************************

ఇవి కూడా చదవండి..

******************************

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి.. సీబీఐ అనుమానాలేంటి..!?


******************************

YS Jagan : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో సీఎం జగన్ సడన్‌గా.. ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చ


*****************************

YS Bhaskar Reddy Arrest Live Updates : తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన..


Updated Date - 2023-04-16T16:27:49+05:30 IST