YSRCP : వైసీపీలో ఇంత చిల్లర బ్యాచ్ ఉందేంట్రా బాబోయ్.. ఛీ.. ఛీ.. సిగ్గో సిగ్గు..!

ABN , First Publish Date - 2023-03-20T17:41:32+05:30 IST

వైసీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు (YSRCP Activists), వైఎస్ జగన్ వీరాభిమానులు (YS Jagan Fans) బరితెగిస్తున్నారు...

YSRCP : వైసీపీలో ఇంత చిల్లర బ్యాచ్ ఉందేంట్రా బాబోయ్.. ఛీ.. ఛీ.. సిగ్గో సిగ్గు..!

వైసీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు (YSRCP Activists), వైఎస్ జగన్ వీరాభిమానులు (YS Jagan Fans) బరితెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై ఇష్టానుసారం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా టీడీపీ మహిళా నేతలు (TDP Women Leaders), మహిళా కార్యకర్తల ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిల్లర బ్యాచ్ వల్ల ఆ పార్టీ పరువు అమాంతం గంగలో కలిసిపోతోంది. అసలే.. ఓ వైపు నేతలు ఆడియో రికార్డింగ్‌తో వైసీపీ పరువు తీయగా.. ఇప్పుడు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా (Social Media) ఉన్న ఆ కాసింత పరువును తీస్తున్నారంటూ అధిష్ఠానం గగ్గోలు పెడుతోంది. ఇంతకీ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ఆ చిల్లర పనులేంటో..? అసలెందుకీ చిల్లర బ్యాచ్ ఈ రేంజ్‌లో బరితెగిస్తోంది..? ఓ లుక్కేద్దాం రండి..!

అసలేం జరిగింది..!?

వైసీపీ కార్యకర్తల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. సోషల్ మీడియా వేదిగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. విమర్శలకు ఒక హద్దు ఉంటుంది కానీ.. అది కాస్త దాటిపోయి మరీ బరితెగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారిని టార్గెట్ చేస్తూ.. వాళ్ల ఫొటోలను ట్విట్టర్‌లో నుంచి తీసుకోవడం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఎవరెవరితోనో లింకులు అంటగట్టినట్లు ట్వీట్స్ చేయడం వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఇదో అలవాటుగా మారిపోయింది. టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలకు చెందిన మహిళా కార్యకర్తలు స్థానిక నేతలతో లేదా అధినేతలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆలస్యం ఇక ఆ ఫొటోలపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేయడం.. అదేదో ఘనకార్యం చేసేశామని వైసీపీలోనే కొందరికి ఆ ఫొటోలను ట్యాగ్ చేస్తుంటారు. వాళ్లంతా మళ్లీ అభ్యంతర ట్వీట్స్ చేయడం ఇలా కొందరు కార్యకర్తలు శునకానందం పొందుతున్నారు. ఇలా మహిళా కార్యకర్తలనే కాదు.. ఆఖరికి ప్రజాప్రతినిధులను సైతం ఇలా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారంటే అలా విమర్శలు చేసేవారి కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఇలానే అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా..? అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోనీ.. ఒక ఆడపడుచును అలా మాట్లాడేటప్పుడు కానీ.. పోస్టులు పెట్టేటప్పుడు ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారనే విషయం తెలుసుకుంటే మంచిదేమో అని నిపుణులు మండిపడుతున్నారు.

YSRCP-Trolls.jpg

తాజాగా ఇదీ పరిస్థితి..!

వైసీపీకి చెందిన ఓ కార్యకర్త ‘జగన్ అన్నకోసం’ అనే పేరు ట్విట్టర్ ఖాతా ప్రారంభించాడు. ఆయనకు 7,980 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కార్యకర్తగా పార్టీకోసం ఏమైనా చేశాడా అంటే.. ఆయన చేస్తోందల్లా టీడీపీలోని మహిళా కార్యకర్తలు, నేతల ఫొటోలను తీసుకోవడం వారిపై సెటైర్లు, ఇష్టానుసారం కామెంట్స్ చేయడమే పని. తాజాగా.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి ఇంచార్జ్ బండారు శ్రావణి ట్విట్టర్ నుంచి ఒక ఫొటోను తీసుకున్న ఇతను.. ‘ అసలు నేను టీడీపీలోకి ఎందుకు పోకూడదో ఒక్క కారణం చెప్పండి.. అక్కడ స్వాగతం పలకడానికి హారతి ఇచ్చే దేవతలు ఉన్నారు బ్రో..’ అని ట్వీట్ చేశాడు. ఇలా ట్వీట్ వచ్చిందే ఆలస్యం.. ఇక కొందరు వైసీపీ కార్యకర్తలు అయితే ఎగబడి కామెంట్స్ చేస్తున్నారు. అంతే రీతిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సైతం దిమ్మతిరిగేలా కౌంటర్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఇలా ఒకరిద్దరినో కాదు.. చాలా మంది వైసీపీ కార్యకర్తలు బాధితులు ఉన్నారు. పోనీ ఇలా అసభ్యంగా తమపై కామెంట్స్ చేస్తున్నారని ఎవరైనా పోలీసులకు ఫిర్యాదులు చేస్తే మాత్రం అస్సలు పట్టించుకునే నాథుడే ఉండడని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. అదే.. వైసీపీ మహిళా కార్యకర్తలు కానీ మహిళా నేతలపై కానీ టీడీపీ కార్యకర్తలు ఎవరైనా కామెంట్స్ చేశారో నిమిషాల్లో జైల్లో పెట్టి ఊచలెక్కిస్తుంటారు.. ఇదేం న్యాయమో ఖాకీలకే తెలియాలి మరి.

ఇకనైనా.. ఇలాంటి చిల్లరగా కామెంట్స్ చేయడం మానితే ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఇలాంటి ఉన్మాదుల పట్ల వైసీపీ అధిష్టానం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల పైసా ప్రయోజనం ఏమైనా ఉందా అంటే లేనే లేదు. చిల్లరమల్లరగా కామెంట్స్ చేయడం వల్ల పార్టీ పరువు పోతుందనే విషయం గమనించి మెలిగితే ఎంతైనా మంచిది మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

AP MLC Election Results 2023 : వైఎస్ జగన్‌ను ఏకిపారేస్తున్న వైసీపీ సోషల్ మీడియా.. ఏమైందా అని ఆరాతీస్తే..!

******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!
******************************

YSRCP : ఏపీ కేబినెట్‌ నుంచి ముగ్గురు ఔట్ కానున్నారా.. జగన్ ప్రకటనతో మంత్రుల్లో పెరిగిపోయిన టెన్షన్.. ఇంతకీ వారెవరు..!?

******************************
Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?


******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..

Updated Date - 2023-03-20T17:48:51+05:30 IST