Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!

ABN , First Publish Date - 2023-03-15T23:38:07+05:30 IST

జనసేన 10వ ఆవిర్భావ సభ (Janasena Formation Day) గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇసుక వేస్తే రాలనంత మంది జనం, వీరాభిమానులు ఆవిర్భావ వేడుకలకు తరలొచ్చారు. బహుశా ఈ రేంజ్‌లో విజయవంతం అవుతుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్..

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!

జనసేన 10వ ఆవిర్భావ సభ (Janasena Formation Day) గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇసుక వేస్తే రాలనంత మంది జనం, వీరాభిమానులు ఆవిర్భావ వేడుకలకు తరలొచ్చారు. బహుశా ఈ రేంజ్‌లో విజయవంతం అవుతుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కూడా ఊహించి ఉండరేమో. ఇక సభావేదికగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం కూడా అదిరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిర్భావ వేడుకలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. తన ప్రసంగంలో పదే పదే ‘కాపు’ (Kapu) కుల ప్రస్తావన తేవడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. పవన్ ప్రసంగం ప్రారంభం మొదలుకుని.. ముగిసే వరకూ వందల సార్లు ‘కాపు’ కుల ప్రస్తావనే వచ్చింది. పదే పదే కుల ప్రస్తావనతో జనాల్లో సందేహాలు మొదలయ్యాయి. కుల రహిత సమాజం కావాలని ఒకప్పుడు నినదించిన పవన్ ఇప్పుడు సడన్‌గా కులప్రస్తావన తేవడమేంటి..? అని అభిమానులు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారట. అసలు పవన్ ఎందుకిలా కుల ప్రస్తావన తెచ్చారు..? పక్కా ప్లాన్‌తో పవన్ ఇలా మాట్లాడారా..? ఆయన మనసులో ఏముంది..? పవన్ గురించి కాపులు ఏమనుకుంటున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Janasena-Pawan-1.jpg

పదే పదే ఎందుకిలా..!?

రాజకీయాల్లో అది కూడా ఏపీలో కుల రహిత రాజకీయం అంటే చాలా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కులం అనేది తెరవెనుక మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా అగ్రనేతలెవ్వరూ బహిరంగవేదికలపై కుల ప్రస్తావన అస్సలు తీసుకురారు. కానీ పవన్ ఎందుకో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కుల ప్రస్తావన తెస్తున్నారు. ఆఖరికి బహిరంగ సభావేదికగా ఒకటా రెండు ఏకంగా వందల సార్లు ‘కాపు’ కుల ప్రస్తావన తెచ్చారు. ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని.. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలంటే జనసేన పాలన రావాలనే చెబుతూ కాపుల గురించి మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు మారాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కాపులంతా ఐక్యంగా ఉంటే.. మిగిలిన కులాల వారూ వెంట నడుస్తారన్నారు. అయితే.. బహిరంగ సభల్లో ఏం మాట్లాడాలి..? ఎలా మెలగాలి..? అనే విషయాలపై పవన్ ఇంకా చాలా పరిణితి చెందాలని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ రాజకీయంగా కీలక దశలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ లక్ష్యాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ.. సడన్‌ ‘కాపు’ రాగం ఎత్తుకోవడంతో వీరాభిమానులు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. అయితే దీనివెనుక పెద్ద కథే ఉందట.

Janasena-Pawan.jpg

కారణం ఇదేనా..!

మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ (Prajarajyam) పార్టీ పెట్టినప్పుడు కాపులంతా ఆయనకు అండగా ఉండి ముందుకు నడిపించారు. ఒక్క కాపులే కాదు అన్ని కులాల్లోని ప్రజలు ఆయన్ను నమ్మి ఎవరూ ఊహించని రీతిలో మొదటిసారే ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీని గెలిపించారు. అయితే చిరు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యంను విలీనం చేయడంతో కాపులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే వార్తలు అప్పట్లో బోలెడన్ని వచ్చాయి. దీంతో అప్పుడు కాపుల్లో మొదలైన అసంతృప్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తోందట. బహుశా ఇప్పటి వరకూ అదే ప్రజారాజ్యం పార్టీ ఉండుంటే సామాజిక వర్గం, నేతలు పరిస్థితి మరోలా ఉండేదని మదనపడిపోతున్నారట. అయితే సరిగ్గా ఇదే సమయంలో కాపులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని భావించిన ‘జనసేన’ అని పార్టీ పెట్టారనే టాక్ కూడా ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ పవన్‌ను కాపులు ఆదరించలేదు. ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసినా ఒక్క చోట కూడా గెలవలేదు. నాటి ప్రజారాజ్యం పార్టీ నుంచి నేటి జనసేన వరకూ పరిస్థితులు మారిపోయాయని దీంతో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. పవన్ ఒంటరిగా రాకుండా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడంతోనే కాపులు మరింత అసంతృప్తికి లోనై జనసేనను ఆదరించలేదని ఇన్‌సైడ్ టాక్. అందుకే ఇక కాపులను మళ్లీ దగ్గరచేసుకోవాలని పవన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తాజా ప్రసంగాన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే నాడు జరిగిన ఆ ఒక్క తప్పునూ సరిదిద్దుకునే పనిలో ఉన్నారట.

Praja-Rajyam.jpg

ఈసారి చాలా వ్యూహాత్మకంగా..!

వాస్తవానికి ఏపీలో ఏ పార్టీ గెలవాలన్నా కాపు ఓట్లు (Kapu Votes) కీలకం.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు కాపు పెద్దలు ఎలా చెబితే అలాగే ఆ సామాజిక వర్గం నడుచుకునేది. అయితే గత పదేళ్లుగా ఈ పరిస్థితుల్లేవనే చెప్పుకోవాలి. ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) లాంటి వారు కాపులందర్నీ ఐక్యం చేయాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ అప్పటికే కాపుల్లో చీలిక వచ్చేసిందని టాక్. అటు టీడీపీవైపు కొందరు.. ఇటు వైసీపీ వైపు ఇంకొందరు అంతా విడిపోయారు. దీంతో ఓట్లన్నీ విచ్ఛిన్నం అయిపోయాయి. ఇప్పుపవన్ వారందర్నీ ఏకథాటిపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న పవన్ ఈసారి ఎన్నికల్లో అస్సలు ఆ పరిస్థితి ఉండకూడదని.. కాపులందర్నీ ఐక్యం చేసే పనిలో నిమగ్నమయ్యారట. ఇందుకోసం చాలా ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా పదే పదే కాపు పెద్దలతో సమావేశం కావడం.. ఆఖరికి బహిరంగ సభల్లోనూ ఎక్కడా చూసినా ‘కాపు’ ప్రస్తావన తెస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా మునుపెన్నడూ లేనివిధంగా వంగవీటి రంగా (Vangaveeti Ranga) పేరు కూడా ప్రస్తావనకు తీసుకురావడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈసారి ఎలాగైనా సరే కాపుల అండతోనే పార్టీ ముందుకెళ్తుందని గట్టిగా పవన్ నమ్ముతున్నారట. అందుకే ఇప్పట్నుంచే అన్నీ షురూ చేశారట. మున్ముందు ఇంకా చాలానే తన అస్త్రాలన్నీ బయటికి తీస్తారట. ఇప్పటి వరకూ ఆయన సొంతంగా చేసుకున్న సర్వేల్లో తనవైపే చాలా వరకు కాపులంతా ఉన్నారని.. ఈసారి కచ్చితంగా పవన్‌ను ఆదరించాలని తేలిందట.

Pawan-Final.jpg

మొత్తానికి చూస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం ఈసారి గట్టిగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పవన్‌ను కాపులు ఏ మాత్రం ఆదరిస్తారో..? పవన్ వ్యూహాలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో తెలియాలంటే 2024 ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే మరి.

*************************

ఇది కూడా చదవండి..

*************************

Pawan Kalyan: వైసీపీ అనుకున్నది జరగదు!

*************************

MLC Kavitha ED Enquiry : ఈడీ విచారణకు కవిత.. అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి కేటీఆర్, హరీష్.. ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..!


*************************

TS BJP : తెలంగాణ బీజేపీలో ఎగసిపడుతోన్న అసంతృప్తి జ్వాలలు.. ఈటల ఢిల్లీ వెళ్లడంతో..!

*************************

YS Jagan : అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ కీలక ప్రకటన.. ఆ ఒక్కటీ చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తానని తేల్చిచెప్పిన సీఎం..

*************************

TS BJP : తెలంగాణ బీజేపీలో కొనసాగుతోన్న అలజడి.. రాజీనామా వార్తలపై ఫస్ట్ టైమ్ స్పందించిన ఈటల..

*************************

Updated Date - 2023-03-15T23:49:21+05:30 IST