Avinash In Viveka Case : సీబీఐ విచారణకు వెళ్తున్న ఎంపీ అవినాష్‌కు చివరి నిమిషంలో ఫోన్ చేసిందెవరు..!?

ABN , First Publish Date - 2023-05-16T21:21:38+05:30 IST

అవినాష్.. అవినాష్.. ఇవాళ ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన పేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో..

Avinash In Viveka Case : సీబీఐ విచారణకు వెళ్తున్న ఎంపీ అవినాష్‌కు చివరి నిమిషంలో ఫోన్ చేసిందెవరు..!?

అవినాష్.. అవినాష్.. ఇవాళ ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన పేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని (Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణకు (CBI Enquiry) రావాలని సోమవారం నాడు నోటీసులు జారీచేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఉదయం నుంచి పెద్ద హైడ్రామానే జరిగింది. విచారణకు రాలేనని అవినాష్.. రావాల్సిందేనని సీబీఐ.. నాలుగు రోజులు గడువు కావాలని ఎంపీ.. కుదరదని అధికారులు.. ఇలా గంటల తరబడి పెద్ద కథే నడిచింది. చివరికి రెండోసారి అవినాష్ విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించింది. అయితే.. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాకముందే అవినాష్ హైదరాబాద్ నుంచి కడపకు (Hyderabad-Kadapa) బయల్దేరి వెళ్లారు. ఇవన్నీ బయటికి తెలిసిన విషయాలే.. అయితే విచారణకు బయల్దేరి వెళ్లే ఆఖరి నిమిషంలో ఒక్క ఫోన్‌కాల్‌తో అవినాష్ ఆగిపోయారట. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎక్కడ్నుంచి వచ్చింది..? ఆ కాల్ చేసిన వ్యక్తెవరు..? ఫోన్‌లో ఏం చెప్పారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

CBI.jpg

అసలేం జరిగింది..!?

వివేకా కేసు విచారణ గడువు జూన్-20 వరకు మాత్రమే ఉండటంతో దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ వేగం పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేయడం.. మరికొందర్ని విచారించడం ఇలా వీలైనంత త్వరలో కేసును కొలిక్కి తేవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి నోటీసులు వెళ్లాయి. మంగళవారం విచారణకు రావాలని సోమవారం రోజున సీబీఐ నోటీసులు పంపింది. దీంతో కడపలో ఉన్న అవినాష్ హైదరాబాద్‌కు బయల్దేరి రాత్రికిరాత్రే వచ్చేశారు. ఇవాళ విచారణకు వెళ్లాలని ఫిక్స్ అయిన ఎంపీ సీబీఐ ఆఫీసుకు బయల్దేరడానికి సిద్ధమయ్యారు కూడా. అయితే చివరి నిమిషంలో ఆయనకు ఫోన్ కాల్ రావడంతో విచారణకు వెళ్లకుండా మనసు మార్చుకుని ఆగిపోయారట. అప్పుడే విచారణకు రావట్లేదని.. గడువు కావాలని సీబీఐను అవినాష్‌ కోరారట. సీన్ కట్ చేస్తే ఇంతకీ ఆ ఫోన్ చేసిన వ్యక్తెవరు..? ఫోన్ చేసి ఏం చెప్పారు..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ (YS Jagan Reddy) అని కొందరు అంటుంటే.. వైఎస్ భారతీరెడ్డి (YS Bharathi Reddy) అని మరికొందరు సోషల్ మీడియాలో (Socail Media) చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈసారి అవినాష్ విచారణకు వస్తే మాత్రం కచ్చితంగా అరెస్ట్ చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి.

Avinash-Reddy.jpg

అవినాష్ అనుకున్నది ఇదేనా..!?

ఫోన్‌లో మాట్లాడింది ఎవరు..? ఏం చెప్పారనేది క్లారిటీ లేదుగానీ.. విచారణకు వెళ్లొద్దని మాత్రం చెప్పారన్నది తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. తక్షణమే పులివెందులకు వెళ్లాల్సిందేనని అవినాష్‌తో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలా జరిగిన తర్వాతే ఆయన సీబీఐకి విచారణకు రాలేనని చెప్పడం, గడువు కోరడం అన్నీ చకచకా జరిగిపోయాయట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒకవేళ విచారణకు రాకుంటే పులివెందులలో అరెస్ట్ చేస్తే మాత్రం అది కూడా రాజకీయంగా కలిసొస్తుందని అవినాష్ భావించారట. అందుకే సీబీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకమునుపే ఏదైతే అది కానీలే అని హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎంపీ హైదరాబాద్ నుంచి మార్గమధ్యలో ఉండగానే సీబీఐ బృందం పులివెందులలోని అవినాష్ ఇంటికి చేరుకోవడంతో ఇక పక్కాగా అరెస్ట్ అని అందరూ ఉలిక్కి పడ్డారు కానీ.. వైఎస్ భాస్కర్ రెడ్డి కారు డ్రైవర్‌కు నోటీసులిచ్చి పులివెందుల నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ రెండ్రోజుల్లోనే పులివెందులలోనే అవినాష్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కడపలో చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : హైదరాబాద్ నుంచి ఎంపీ అవినాష్ ఇంటికి రాకముందే.. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం.. అంతా టెన్షన్ పడ్డారు కానీ..

******************************
YS Viveka Murder Case : దూకుడు పెంచిన సీబీఐ.. విచారణకు హాజరైన వైఎస్ సునీత, రాజశేఖర్.. ఈ ఒక్క విషయంపైనే ప్రశ్నల వర్షం..


******************************

Updated Date - 2023-05-16T21:26:34+05:30 IST