YS Viveka Murder Case : దూకుడు పెంచిన సీబీఐ.. విచారణకు హాజరైన వైఎస్ సునీత, రాజశేఖర్.. ఈ ఒక్క విషయంపైనే ప్రశ్నల వర్షం..

ABN , First Publish Date - 2023-05-16T18:32:27+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) మంగళవారం రోజే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి...

YS Viveka Murder Case : దూకుడు పెంచిన సీబీఐ.. విచారణకు హాజరైన వైఎస్ సునీత, రాజశేఖర్.. ఈ ఒక్క విషయంపైనే ప్రశ్నల వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) మంగళవారం రోజే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణలో హైడ్రామా నెలకొనడం, ఆఖరికి ఈనెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీచేయడం, ఇటు హైదరాబాద్ నుంచి అవినాష్ కడపకు బయల్దేరడం.. అటు ఈయన రాకముందే పులివెందులకు సీబీఐ బృందం చేరుకోవడం అభిమానులు, కార్యకర్తల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఆఖరికి నోటీసులు మాత్రమే ఇచ్చి సీబీఐ బృందం వెనుదిరగడంతో అవినాష్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. అవినాష్ ప్రధాన అనుచరులుగా చెప్పుకునే నాగేళ్ల విశ్వేశ్వర రెడ్డి (Nagella Visweswar Reddy), వర్రా రవీంద్రా రెడ్డి (Varra Ravindra Reddy), శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) లను మంగళవారం మధ్యాహ్నం సీబీఐ విచారణకు (CBI Enquiry) హాజరయ్యారు. మే-16న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికీ సీబీఐ నోటీసులిచ్చింది. సరిగ్గా ఇదే సమయంలోనే సీబీఐ దూకుడు పెంచింది.

YS-Sunitha.jpg

ప్రశ్నల వర్షం అంతా..!

ఇవాళే సీబీఐ విచారణకు వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ఈ ఇద్దరూ సీబీఐ ఎదుట హాజరవ్వగా.. తాజాగా మరోసారి విచారణకు రావడంతో ఉత్కంఠ నెలకొంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ అధికారులు మొదట్నుంచీ రికార్డింగ్ చేస్తున్నారు. ఇవాళ కూడా సునీత, రాజశేఖర్ స్టేట్మెంట్‌ను సీబీఐ నమోదు చేసింది. అయితే.. ఈ విచారణలో వివేకానందరెడ్డి రాసిన లేఖపైనే పలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పారు..? అనేదానిపై అరగంటపాటు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కాగా.. వివేకా రాసిన లెటర్‌ను ఎందుకు పట్టించుకోవట్లేదు..? వివేకా రెండో పెళ్లి గురించి ఎందుకు పరిగణనలోని తీసుకోవట్లేదు..? అని ఎంపీ అవినాష్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు మొదట్నుంచీ సీబీఐని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అసలు ఆ లెటర్ సంగతేంటో తేల్చాలని భావించిన సీబీఐ.. దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది.

Viveka-Letter.jpg

లేఖ విషయంలో సీబీఐ ఇలా..!

వివేకా కేసు విచారణ గడువు జూన్-20వరకు మాత్రమే ఉండటంతో దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ వేగం పెంచింది. వివేకా రాసిన లేఖపై (Viveka Letter) వేలి ముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు ప్రారంభించింది. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ (CFSNL) తేల్చిన విషయం తెలిసిందే. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను (కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్) సీబీఐ కోరింది. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకూ ఈ లేఖ వ్యవహారం పెను సంచలనంగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. హత్యస్థలిలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి- 11న సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపింది. నిన్‌హైడ్రేట్ పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చెబుతోంది. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున కోర్టును సీబీఐ అధికారులు ఆశ్రయించారు. లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్ష (Ninhydrin Test)) జరిపేందుకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే.. ఈ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానం నిందితుల స్పందన కోరింది. సీబీఐ పిటిషన్‌పై జూన్-2న విచారణ న్యాయస్థానం జరపనున్నది.

Sunitha-and-Rajasekhar.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************
Viveka Murder Case : ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకాని ఎంపీ అవినాష్.. అనుచరులు వెళ్లడంతో..

******************************

Avinash In Viveka Case : హైదరాబాద్ నుంచి ఎంపీ అవినాష్ ఇంటికి రాకముందే.. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం.. అంతా టెన్షన్ పడ్డారు కానీ..

******************************

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..

******************************

Updated Date - 2023-05-16T18:51:12+05:30 IST