Karnataka Results : అరెరే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఏరికోరి మరీ బ్రహ్మానందంను తెచ్చుకుంటే..!

ABN , First Publish Date - 2023-05-13T20:02:15+05:30 IST

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఎవరూ ఊహించని రీతిలో 136 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం (Congress Grand Victory) సాధించింది. అదిగో గెలిచేస్తున్నాం..

Karnataka Results : అరెరే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఏరికోరి మరీ బ్రహ్మానందంను తెచ్చుకుంటే..!

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఎవరూ ఊహించని రీతిలో 136 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం (Congress Grand Victory) సాధించింది. అదిగో గెలిచేస్తున్నాం.. ఇదిగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తున్నాం.. దక్షిణాదిన జెండా పాతుతామన్న బీజేపీ మాత్రం ఇందులో సగం సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇక కింగ్ మేకర్ (King Maker) అనుకున్న జేడీఎస్ (JDS) కూడా అడ్రస్ లేకుండా పోయింది. క్యాంప్ రాజకీయాలకు ఎలాంటి చోటులేకుండా పూర్తి మెజార్టీని కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో ఒకటి రెండ్రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) ఏర్పాటు చేయబోతోంది. అయితే.. ఇప్పుడంతా అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన, వారి తరఫున ప్రచారం చేసిన నేతలు, సెలబ్రిటీల గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు.. బండి సంజయ్ లాంటి అగ్రనేతలు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఘోరాతి ఘోరంగా బీజేపీ ఓడిపోయింది. కొన్నిచోట్ల కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడంతా టాలీవుడ్ నటుడు బ్రహ్మానందం గురించి ప్రస్తావన తెస్తున్నారు. అప్పట్లో ఈయన కర్ణాటక వెళ్లి మరీ నాటి మంత్రి సుధాకర్ తరఫున చిక్‌బళ్లాపూర్‌లో (Chikkaballapur) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే బ్రహ్మి ప్రచారం ఏ మాత్రం వర్కవుట్ అయ్యింది..? ఇంతకీ ఆయన గెలిచారా లేదా..? అనేదానిపై సోషల్ మీడియాలో (Social Media) తెగ చర్చించుకుంటున్నారు.

Untitled-3.jpg

ఇదీ అసలు కథ..

ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరఫున నటీనటులు ప్రచారానికి రావడం కొత్తేమీ కాదు.. చాలా ఏళ్ల తరబడి ఇది జరుగుతోంది. ఓటర్లను ఆకర్షించడం కోసం సినీ గ్లామర్‌ను పార్టీలు వినియోగించుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ప్రచారానికి తీసుకొస్తే నాలుగు ఓట్లు పడతాయని లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పార్టీలు తెచ్చుకుంటూ ఉంటాయి. అయితే ఎక్కడో కర్ణాటకలో ఎన్నికలు జరిగితే.. దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల ముఖాల్లో చెరగని చిరునవ్వుకు కారణమైన బ్రహ్మానందం.. నాటి కర్ణాటక ఆరోగ్య శాఖమంత్రి సుధాకర్ (Sudhakar) కోసం కోసం కాళ్లకు బలపం కట్టుకుని మరీ సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేశారు. కామెడీ చేసి జనాల్ని కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం ఇంత సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారేంటి..? ఇంతకీ ఆయనెవరబ్బా అని..? జనాలంతా గూగుల్‌లో తెగ వెతికారు. శనివారం నాడు ఫలితాలు రావడంతో బ్రహ్మి ఎన్నికల ప్రచారం ఏ మాత్రం వర్కవుట్ అయ్యిందని తెలుసుకోవడానికి తెలుగు ప్రజలు, సుధాకర్ అభిమానులు, కార్యకర్తలు ఇంట్రెస్ట్ చూపించారు. సీన్ కట్ చేస్తే.. సుధాకర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ ఈశ్వర్‌ 11,130 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈశ్వర్‌కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్‌కు 57, 878 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Brammd.jpeg

బ్రహ్మీకి చేదు అనుభవం..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీకి.. కనీసం ఏ అభ్యర్థికి కూడా మద్దతివ్వని బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం కొసమెరుపని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే సుధాకర్‌కు మద్దతుగా బ్రహ్మానందం ప్రచారం చేయడంతో ఆయన గెలిచి.. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే.. ఈసారి కూడా బ్రహ్మీ ప్రచారం కలిసొస్తుందని భావించిన సుధాకర్ ఒప్పించి మరీ 4 రోజుల ప్రచారానికి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఎందుకో మునుపటి సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. బ్రహ్మి ప్రసంగం తెలుగు ఓటర్లను పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఇప్పుడు సుధాకర్ పరాజయంతో బ్రహ్మీకి చేదు అనుభవంగానే మిగిలింది.

Modi.jpg

అగ్రనేతలు ప్రచారం చేసిన చోట ఇలా..!

కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌లు ఆఖరి నిమిషం వరకూ అస్రశస్త్రాలన్నీ ప్రయోగించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో బీజేపీ.. అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించింది. అయితే.. మోదీ మొత్తం 42 స్థానాల్లో ప్రచారం నిర్వహించగా కేవలం 20 స్థానాల్లో మాత్రం కాషాయ జెండా ఎగిరింది. ఇక అమిత్ షా ర్యాలీ చేసిన 30 స్థానాల్లో 11 మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అయితే.. రాహుల్ గాంధీ ర్యాలీ చేసిన 22 స్థానాల్లో 16 గెలవగా.. ప్రియాంక గాంధీ ర్యాలీ చేసిన 27 స్థానాల్లో 17 సీట్లు కాంగ్రెస్ దక్కించుకోవడం హస్తం పార్టీకి మంచి కిక్కిచ్చింది. దీంతో రాహులా మజాకా అని కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంత పెద్ద తలకాయలు ప్రచారం చేసిన చోటే ఇంత ఘోరంగా ఓడిపోయారంటే.. వాళ్ల ముందు బ్రహ్మీ పరిస్థితేంటో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదేమో.!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Karnataka Results : కర్ణాటకలో బండి సంజయ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఇంత ఘోరమా.. సోషల్ మీడియాలో వైరల్..!

******************************

Telangana Leaders : కర్ణాటక ఫలితాలతో పొంగులేటి, జూపల్లికి ఫుల్ క్లారిటీ వచ్చేసిందా.. వాట్ నెక్స్ట్..?

******************************

Karnataka Election Results : కర్నాటక ‘హస్త’గతం.. ఏదో అనుకున్న కేసీఆర్ ఇప్పుడెలా ఫీలవుతున్నారో..!?

******************************

Karnataka Election Results : హైదరాబాద్‌కు మారుతున్న కర్ణాటక రాజకీయాలు.. హోటల్స్ అన్నీ ఫుల్.. రేవంత్‌రెడ్డితో కీలక మంతనాలు

******************************

TS Congress : కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో కనిపించిన సీన్ ఇదీ..


******************************

Updated Date - 2023-05-13T20:07:45+05:30 IST