Avinash Vs CBI : ఎంపీ అవినాష్ తల్లికి ఏమైంది.. విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు..? అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన లాయర్లు..

ABN , First Publish Date - 2023-05-19T13:28:15+05:30 IST

అవినాష్.. అవినాష్.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! విచారణకు రావాల్సిందేనని సీబీఐ.. రాకుండా ప్రతిసారీ ఎంపీ డుమ్మాకొడుతుండగా ఈ ఎంక్వయిరీ ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు కనిపించట్లేదు.

Avinash Vs CBI : ఎంపీ అవినాష్ తల్లికి ఏమైంది.. విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు..? అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన లాయర్లు..

అవినాష్.. అవినాష్.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! విచారణకు రావాల్సిందేనని సీబీఐ.. రాకుండా ప్రతిసారీ ఎంపీ డుమ్మాకొడుతుండగా ఈ ఎంక్వయిరీ ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు కనిపించట్లేదు. శుక్రవారం (మే-19న) పక్కాగా విచారణకు వెళ్లాలని అవినాష్ భావించినా ఆఖరి నిమిషంలో రావట్లేదని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన తల్లికి అనారోగ్యంతో బాధపడుతూ పులివెందుల ఆస్పత్రిలో చేరారని సమాచారం రావడంతో విచారణ మార్గమధ్యలోనే స్వగ్రామానికి బయల్దేరి వెళ్లారు. అయితే.. ఆయనొస్తారని వేచి చూసిన సీబీఐ అధికారులు ఆఖరికి రావట్లేదని తెలిసి.. విచారణకు రాకుండా ఎక్కడికెళ్తున్నారు..? విచారణకు మించి ముఖ్యమైన పని ఏముందని ఆరాతీసే పనిలో నిమగ్నమవ్వగా.. తన విచారణకు మరో తేదీ ఇవ్వాలని లేఖ వచ్చింది. అయితే.. అసలు ఎంపీ తల్లికి ఏమైంది..? సీబీఐ అధికారులు ఏమంటున్నారు..? అనే విషయాలపై ఎంపీ తరఫు లాయర్లు పూసగుచ్చినట్లుగా మీడియాకు వివరించారు.

avinash1.jpg

సీబీఐ కార్యాలయానికి లాయర్లు..!

ఇవాళ ఉదయం నుంచి విచారణకు వెళ్లాలా.. వద్దా..? అని తన లాయర్లు, న్యాయ నిపుణులతో అవినాష్ రెడ్డి సమాలోచనలు చేశారు. ఆఖరికి విచారణకు వెళ్లాలని నిర్ణయించిన ఆయన.. కోఠీలోని సీబీఐ ఆఫీసుకు తన ఇంటి నుంచి బయల్దేరారు. దారిలో ఉండగానే తల్లి శ్రీలక్ష్మికి ఆరోగ్యం బాగోలేదని కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో అక్కడ్నుంచీ పులివెందులకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వడానికి అవినాష్ లాయర్లు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఆఫీసులో ఎవరూ అందుబాటులో లేరు. అవినాష్‌ పులివెందులకు వెళ్తుండగా ఆయన్ను సీబీఐ బృందం వెంబడిస్తోంది..!. దీంతో ఎంపీని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని టాక్ పెద్ద ఎత్తున నడుస్తోంది.

YS-Viveka-PSDD.jpg

న్యాయవాదులు ఏమంటున్నారు..!?

ఇవాళ్టి ఎపిసోడ్‌లో అసలేం జరిగిందనే విషయాలపై అవినాష్ తరఫు న్యాయవాది మల్లారెడ్డి పూగుచ్చినట్లుగా మీడియాకు వివరించారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చింది. ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్చించారు. అందుకే విచారణకు రావట్లేదు.. అవినాష్ పులివెందుల వెళ్తున్నారు. తల్లికి ఆరోగ్యం బాగో లేకపోవడంతోనే ఇవాళ్టి విచారణకు ఎంపీ హాజరుకాలేకపోయారు. విచారణకు రావాలనే ఇంటి నుంచి బయల్దేరగా పులివెందుల నుంచి ఫోన్ వచ్చింది. అవినాష్ తల్లి ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. అవినాష్‌కు సమాచారం అందించారు. అందుకే విచారణకు రాకుండా పులివెందులకు వెళ్లాల్సి వచ్చింది. ఇవాళ విచారణకు హాజరు కాలేకపోతున్నానని అవినాష్ రెడ్డి సిబీఐకి లేఖ పంపారు. మేము (న్యాయవాదులు) మరోసారి వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డికి రాలేకపోయాడంటూ సీబీఐకి తెలియజేయడానికి వచ్చాం. విచారణకు మరో తేదీ ఇవ్వాలని సీబీఐని కోరుతున్నాముఅని మల్లారెడ్డి మీడియాకు వివరించారు.

Avinash-Reddy-CBI-Enquiry.jpg

నో రియాక్షన్..!

అవినాష్ రాసిన లేఖపైగానీ.. ఆయన తరఫు న్యాయవాదుల విజ్ఞప్తికి గానీ ఇంతవరకూ సీబీఐ నుంచి స్పందన రాలేదు. హైదరాబాద్ నుంచి కడపకు సీబీఐ అధికారులు బయల్దేరడంతో ప్రస్తుతానికి ఆఫీసులో ఎవరూ లేరు. దీంతో న్యాయవాదులు వెనుదిరిగారు. అయితే అవినాష్ వ్యవహారంలో సీబీఐ చాలా సీరియస్‌గా ఉందని మాత్రం దీన్ని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతిసారీ చివరి నిమిషంలో విచారణకు రాకుండా డుమ్మా కొట్టడమేంటి..? ఇప్పటికే సీబీఐ రెండుసార్లు విచారణకు రాలేనని మళ్లీ మళ్లీ ఇలా రాకుండా లేఖలు రాయడమేంటి..? అని సీబీఐ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash Vs CBI : ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ అవినాష్.. వెంటాడుతున్న సీబీఐ.. టెన్షన్.. టెన్షన్..!

******************************

AV vs Bhuma : ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ అఖిల ప్రియ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన మాజీ మంత్రి

******************************

YSRCP : బాలినేని స్థానంలో కీలక నేతను గట్టిగానే ప్లాన్ చేసిన వైఎస్ జగన్.. అంతా ఓకే గానీ వైవీ ఒప్పుకుంటారా..!?

******************************

Updated Date - 2023-05-19T13:38:09+05:30 IST