AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-09-06T17:41:32+05:30 IST

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్‌ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది...

AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్‌ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది. గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అయ్యన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy), ఇతర ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అయ్యన్న వేసిన పిటీషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయ్యన్న తరఫున కోర్టులో న్యాయవాది వీ.వీ సతీష్ వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌లు 505(2), 153A పిటిషనర్‌కి వర్తించదని వాదించారు. అసభ్య పదజాలం ప్రచురించి ప్రచారం చేసిన వారికి 505(2) వర్తిస్తుందని సతీష్ చెప్పారు.


ayyanna-vijasai1.jpg

అసలేం జరిగింది..?

ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అలాంటి పదప్రయోగం చేయవచ్చా..? అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి భాషను వాడటం సరికాదని హైకోర్టు చెప్పింది. అధికార పార్టీ నేతలు అసభ్య పదజాలం వాడటం వల్లే ఇటువంటి భాషను వాడాల్సి వచ్చిందని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని వాదించారు.అయితే.. పిటిషనర్‌కు ఇటువంటి భాష వాడటం అలవాటు అయిపోయిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం అర్నేష్‌ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. అనుచిత వ్యాఖ్యల కేసులో అయ్యన్న పాత్రుడిని అదుపులోనికి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్‌గేట్‌ వద్ద వదిలిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది.

ap-high-court.jpg


ఇవి కూడా చదవండి


Lagadapati Re Entry : లగడపాటి రీ ఎంట్రీ సరే.. ఏ పార్టీ, పోటీ ఎక్కడ్నుంచి.. ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..!?


Bharat Row : ‘భారత్’ గురించి పవన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


BRS First List : బీఆర్ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిపై ఎమ్మెల్యే భర్త ఆసక్తికర వ్యాఖ్యలు!


Telangana : ఎన్నికల ముందు మరో తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్..!


Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు


LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్


TS Assembly Polls : కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య రహస్య భేటీ.. 45 నిమిషాలు అసలేం జరిగింది..!?


YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?



Updated Date - 2023-09-06T18:01:29+05:30 IST