Nellore Politics : రాజకీయాలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుడ్ బై.. ఆందోళనలో అభిమానులు.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..

ABN , First Publish Date - 2023-03-28T20:42:17+05:30 IST

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీని (YSR Congress) కాదని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthy Anuradha) క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేలపై (Four Mlas) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Nellore Politics : రాజకీయాలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  గుడ్ బై.. ఆందోళనలో అభిమానులు.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీని (YSR Congress) కాదని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthy Anuradha) క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేలపై (Four Mlas) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ముగ్గురు ఏ పార్టీలో చేరాలి..? ఏ పార్టీ అయితే తమకు టికెట్ ఇస్తుంది..? ఏ గుర్తుపై పోటీచేస్తే పక్కాగా గెలుస్తామనే దానిపై ఓ అంచనాకు వచ్చేశారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ ముగ్గురు పార్టీ మారతారని తెలియవచ్చింది. అయితే.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy) మాత్రం తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఆయన నిర్ణయంతో నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయమేంటి..? ఈ పరిస్థితుల్లో ఇంత సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

సడన్‌గా ఎందుకిలా..!?

నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి (Mekapati Family) రాజకీయంగా మంచి పేరు, గుర్తింపు ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) జిల్లా రాజకీయాల్లో కాకలు తీరిన వ్యక్తి. ఈయన ఏ పార్టీలో ఉన్నా.. వ్యూహాలు రచిస్తే ఫెయిల్ అయిన రోజుల్లేవని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. నెల్లూరు పెద్దాయనగా పేరుగాంచిన మేకపాటి రాజకీయంగా కీలక పదవులే అధిరోహించారు. మేకపాటి కుటుంబం నుంచి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, కుమారుడు గౌతమ్ రెడ్డి (Mekapati Gowtham Reddy) రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మేకపాటి ఫ్యామిలీ నుంచి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. అయితే గౌతమ్ రెడ్డి హఠాన్మరణం మేకపాటి కుటుంబానికి జీర్ణించుకోలేని విషయం. ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక మునుపే మేకపాటి ఫ్యామిలీలో ఊహించని ఘటన జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారని నిర్ధారణకు రావడంతో అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆయన ఎందుకు ఇలా ఓటేశారనే విషయం ఇదివరకే పలుమార్లు మీడియా వేదికగా స్పష్టం చేశారు కూడా.

Mekapati-Family.jpg

నా వల్ల కాదు..!

క్రాస్ ఓటింగ్ చేశారని నిర్ధారణకు వచ్చిన 24 గంటల్లోనే వైసీపీ వేటు వేయగా.. రోజుల వ్యవధిలోనే తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రస్తుత రాజకీయాలు అంటే నాకు విరక్తి కలుగుతోంది. అసలు రాజకీయాలు చేయడం అనవసరం అని నాకు అనిపిస్తోంది. రాజకీయాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తున్నాను. నేను కోట్లు పెట్టి రాజకీయం చేయలేను. రాజకీయాలు అంటే డబ్బుతో కూడుకున్న పని. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేమని అధిష్ఠానం కూడా చెప్పేసింది. ఇప్పటికే ఓ వ్యక్తి దగ్గర కొన్ని హామీలతో నేను డబ్బులు తీసుకున్నాను. ఇంకా అప్పులు చేసి మరీ రాజకీయాలు చేయడం అంటే నా వల్ల కానే కాదు. అందుకే రాజకీయంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మేకపాటి చెప్పారు.

Mekapati-Chandra.jpg

ట్విస్ట్ ఏమిటంటే..!

చెప్పాల్సిందంతా చెప్పేసిన మేకపాటి (Meakapati) చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. తాను డబ్బులు పెట్టలేను కాబట్టి.. ఎవరైనా వ్యక్తిగానీ, పార్టీగానీ డబ్బులిచ్చి పోటీ చేయమంటే మాత్రం కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇప్పటికే రెండుసార్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి హార్ట్ సర్జరీ జరిగింది. ఆయనకు ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించట్లేదని అనుచరులు చాలా రోజులుగా చెబుతున్నారు. అయితే.. మేకపాటి తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. తామంతా ఎవరితో కలిసి అడుగులేయాలి..? ఏ పార్టీకి మద్దతివ్వాలి..? తమను ఏ పార్టీ ఆదరిస్తుంది..? అని అనుచరులు, ద్వితియశ్రేణి నేతలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికి ఓకే.. రానున్న రోజుల్లో ఈయనకు ఏదైనా రాజకీయ పార్టీ హామీ ఇస్తుందో.. లేకుంటే ఈయనే రాజకీయంగా మళ్లీ నిర్ణయం మార్చుకుంటారేమో చూడాల్సిందే.. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

****************************

ఇవి కూడా చదవండి

******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

******************************

YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్‌ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?

******************************

Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

******************************

Updated Date - 2023-03-28T21:20:39+05:30 IST