TS Assembly Polls : కాంగ్రెస్ ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు.. ఆ రెండు నియోజకవర్గాలకు ఒక్కటి మాత్రమే.. ఎన్నారైల క్యూ..

ABN , First Publish Date - 2023-08-25T22:45:23+05:30 IST

119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. సినిమా, వ్యాపార రంగాలతో పలువురు ముఖ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి ఎన్నారైలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...

TS Assembly Polls : కాంగ్రెస్ ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు.. ఆ రెండు నియోజకవర్గాలకు ఒక్కటి మాత్రమే.. ఎన్నారైల క్యూ..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా.. సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఝలక్ ఇచ్చేలా తొలి జాబితా.. మలి జాబితా అని లేకుండా ఒకేసారి 119 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. సినిమా, వ్యాపార రంగాలతో పలువురు ముఖ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి ఎన్నారైలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


congress.jpg

ఎన్ని దరఖాస్తులు..?

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకూ మొత్తం 1020 దరఖాస్తులు అధిష్టానానికి అందాయి. కొడంగల్, మంథని నుంచి మాత్రం ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయి. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంథని నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఎవరూ పోటీగా కానీ.. ఆశావాహులు కానీ అప్లికేషన్లు వేయలేదు. అయితే.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయడం జరిగింది. రిజర్వ్‌డ్ సెగ్మెంట్లకు అత్యధికంగా దరఖాస్తులు అందిన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Congress-And-BRS.jpg

క్యూ కట్టిన ఎన్నారైలు..!

కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు ఎన్నారైల తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. టికెట్ల కోసం ఢిల్లీలోని అధిష్టానం నుంచి తెలంగాణలోని కీలక నేతల వరకు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. పాలకుర్తి నుంచి డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి.. మక్తల్ నుంచి పోలీస్ చంద్రారెడ్డి.. కొల్లాపూర్ నుంచి అభిలాష్ రావు, కల్వకుర్తి టికెట్ కోసం రఘు సుంకిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచికంది శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల నుంచి మన్యం రాజశేఖర్ రెడ్డిలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Gandhi-Bhavan-Sr.jpg

దరఖాస్తు చేసుకోని సీనియర్లు..

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్లు కొందరు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. మాజీ మంత్రి జానారెడ్డి, వీహెచ్ హనుమంతరావు, రేణుకా చౌదరి, గీతారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకోలేదు. అయితే.. జానారెడ్డి కుమారులిద్దరూ సాగర్ నుంచి పోటీచేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక వీహెచ్ రాజ్యసభ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే లోక్‌సభకు పోటీచేసే అవకాశాలున్నాయి. ఇక రేణుక చౌదరి ఖమ్మం పార్లమెంట్ నుంచి.. గీతారెడ్డి జహీరాబాద్ నుంచి ఎంపీలుగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Congress-Leaders.jpg

ఎవరు ఎక్కడ్నుంచి..!?

కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కీ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, నాగార్జున సాగర్ నుంచి కుందూరు జానారెడ్డి, జానా ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి.. ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, కూతురు త్రిష పేరుతో మరో దరఖాస్తు వేశారు. ఇక ములుగు నుంచి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క, పినపాక నుంచి సీతక్క కుమారుడు సూర్యం, హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి, మిర్యాలగూడ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, కరీంనగర్ నుంచి రమ్యా రావుతో పాటు ఆమె కుమారుడు రితేష్ రావు, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ యాదవ్, మునుగోడు నుంచి పున్నా కైలాష్ నేత, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి, వినోద్ రెడ్డి అప్లికేషన్లు వేశారు. ఇక మధిర టికెట్ కోసం భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకోనున్నారు. చివరి రోజు కావడంతో గాంధీ భవన్ ఆశావాహులతో కోలాహలంగా మారింది. ఈ ఆశావాహుల్లో ఎంతమందికి టికెట్లు దక్కుతాయో ఏంటో చూడాలి మరి.

gandhi-bhavan-hyderabad.jpg


ఇవి కూడా చదవండి


TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?


MLA Seethakka : ఎన్నికల బరిలో సీతక్క కొడుకు.. ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారంటే.. గెలుపు పక్కానేనా..!?


Rebel Trouble In BRS : కేసీఆర్‌కు ఊహించని ట్విస్ట్.. పోటీపై తేల్చి చెప్పేసిన తుమ్మల


TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!





Updated Date - 2023-08-25T22:50:06+05:30 IST