TS BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఫుల్ క్లారిటీ.. రేవంత్ రెడ్డిపై ఈటలకు ఇంత ప్రేమేంటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!?

ABN , First Publish Date - 2023-05-24T19:45:44+05:30 IST

తెలంగాణ బీజేపీకి కొత్త సారథి (Telangana BJP Chief) రాబోతున్నారు..? బండి సంజయ్‌ (Bandi Sanjay) స్థానంలో ఈటల రాజేందర్‌ను (Etela Rajender) అధిష్టానం నియమించబోతోంది.. అతి త్వరలోనే ఈ మార్పు ప్రక్రియ జరగబోతోంది..?..

TS BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఫుల్ క్లారిటీ.. రేవంత్ రెడ్డిపై ఈటలకు ఇంత ప్రేమేంటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!?

తెలంగాణ బీజేపీకి కొత్త సారథి (Telangana BJP Chief) రాబోతున్నారు..? బండి సంజయ్‌ (Bandi Sanjay) స్థానంలో ఈటల రాజేందర్‌ను (Etela Rajender) అధిష్టానం నియమించబోతోంది.. అతి త్వరలోనే ఈ మార్పు ప్రక్రియ జరగబోతోంది..? అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్-01న అధికారిక ప్రకటన రాబోతోంది.. ఇదీ గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. సరిగ్గా ఇదే సమయంలో ఈటల ఢిల్లీ (Etela Delhi Tour) వెళ్లడం.. ఆయన వెళ్లొచ్చిన రెండ్రోజుల వ్యవధిలోనే బండి సంజయ్ కూడా హస్తినకు పర్యటనకు వెళ్లడంతో అసలు అధిష్టానం ఏం చేయబోతోంది..? ఇందులో నిజానిజాలెంత..? అనే విషయాలపై ఈటల రాజేందర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

ETELA.jpg

ఇదీ అసలు కథ..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి ఈటలకు అప్పగిస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈటల బాధ్యతలు అప్పగిస్తేనే బీజేపీ బలోపేతం అవుతుందని.. అధికార పార్టీ నుంచి చేరికలు కూడా భారీగా ఉంటాయని.. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇదే కరెక్ట్ పద్ధతి అని హైకమాండ్‌కు నివేదికలు వెళ్లినట్లుగా కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ పరిస్థితుల్లో అటు ఈటల.. ఇటు బండి సంజయ్ ఢిల్లీ పర్యటనకెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఢిల్లీలో ఏం జరిగిందనే విషయాలు మాత్రం బయటికి రాలేదు కానీ.. ఈటల మీడియా ముందుకొచ్చి అధ్యక్షుడి మార్పుపై, బీజేపీలో పదవిపై స్పష్టత ఇచ్చారు. ‘ బండి సంజయ్ ఆయన శక్తి మేరకు పని చేస్తున్నారు. ఇంకా పార్టీ విస్తారణ జరగాల్సిన అవసరం ఉంది. కొత్తవాళ్లు పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ఏడాది నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదు. ఇదే విషయాన్ని పార్టీ హై కమాండ్ క్లారిటీ ఇచ్చింది’ అని ఈటల చెప్పేశారు. అంతేకాదు.. తనకు ఫలానా పదవి కావాలని ఏనాడూ అధిష్టానాన్ని నోరు తెరిచి అడగలేదని.. ఇకపై భవిష్యత్తులో కూడా అడగనని తేల్చి చెప్పేశారు ఈటల. సో.. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో మార్పు ఉండదన్న మాట.

Bandi-Vs-Etela.jpg

రేవంత్‌కు సూచనలు ఎందుకో..!?

కాంగ్రెస్‌లో (Congress) చేరాలని ఈటల రాజేందర్‌‌‌కు ఇటీవలే ప్రెస్‌మీట్ వేదికగా ఇటీవల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. అయితే తాజాగా మీడియా మీట్‌లో తన ఆప్తమిత్రుడు రేవంత్‌కు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఇప్పుడివే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘రేవంత్.. మిత్రుడిగా చెబుతున్నా.. నీ పార్టీ నాయకులను కాపాడుకో. గెలిచిన వారిని రక్షించుకునే ప్రయత్నం చేయండి’ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి ఈటల సూచించారు.

Etela-Vs-Revanth.jpg

ఇంతకీ ఈటల ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారనేది తెలియని పరిస్థితి. అంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీలోకి టచ్‌లో వెళ్లగా.. రేవంత్‌ను ఈటల అలర్ట్ చేస్తున్నారా..? లేకుంటే మరేదైనా ఉందా..? అనేది ఆ ఇద్దరికే తెలియాలి మరి. నిన్న మొన్నటి వరకూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం, సవాళ్లు, ప్రమాణాలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సడన్‌గా ఈటల కాంగ్రెస్ బాగు కోరి ఎందుకు చెప్పారబ్బా..? ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారేంటి..? అని అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారట. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇదో పెద్ద చర్చగా మారింది. ఇంతకీ ఈటల మనసులో ఏముందో ఏంటో మరి..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!

******************************

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

******************************

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

******************************

YS Avinash Vs CBI : నిన్న రెచ్చిపోయారు.. ఇవాళ సెంటిమెట్‌తో కొడుతున్నారు..రేపేంటో.. బాబోయ్ మాములు కథ కాదే..!

******************************

Updated Date - 2023-05-24T20:00:01+05:30 IST