TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!

ABN , First Publish Date - 2023-05-23T22:25:51+05:30 IST

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మరోసారి వార్తల్లో నిలిచారు.. అదేంటి ఈయన గురించి వార్తలు నిలవడం కొత్తేమీ కాదుగా అనుకుంటున్నారేమో.. అదేమీ కాదండోయ్.. సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారట.

TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మరోసారి వార్తల్లో నిలిచారు.. అదేంటి ఈయన గురించి వార్తలు నిలవడం కొత్తేమీ కాదుగా అనుకుంటున్నారేమో.. అదేమీ కాదండోయ్.. సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారట. అది కూడా బీజేపీ (BJP) పెద్దలు జీర్ణించుకోలేని వ్యాఖ్యలట. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వేదికగా ఈటల చేసినట్లుగా ఉన్న కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఈ మాటలు ఈటలే అన్నారా..? ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితేంటి..? నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోల్లో నిజమెంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.

అసలేంటీ కామెంట్స్..!?

‘బీజేపీకి తెలంగాణలోని (TS BJP) 119 నియోజకవర్గాల్లో పోటీచేయడానికి నాయకులు లేరు. ఎన్నికల్లో కొట్లాడే నైపుణ్యం ఉన్న వాళ్లు అసలే లేరు. అది జగమెరిగిన సత్యం’ అని ఈటల రాజేందర్ అన్నట్లుగా కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మొత్తమ్మీద ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీకి తెలంగాణ అంత సీన్ లేదని ఈటల అన్నారని నెట్టింట్లో ఈ కామెంట్స్ కోడై కూస్తున్నాయి. అసలు ఈటల రాజేందర్ ఈ కామెంట్స్ ఎప్పుడు అన్నారో..? ఏ పరిస్థితుల్లో అన్నారో..? అసలు అన్నారో లేదో తెలియట్లేదు కానీ.. కొందరు నెటిజన్లు మరీ ముఖ్యంగా బీజేపీ అంటే పడని బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఇంకొందరైతే పనిగట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు. అయితే.. ఈ కామెంట్స్‌కు బీజేపీ నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు కనీసం రియాక్ట్ అవ్వని పరిస్థితి.

Etela-Rajender.jpg

రియాక్ట్ కాకపోతే..!?

వాస్తవానికి ఈటల అనని మాటలు అన్నట్లుగా.. రాజేందర్ చేయని పనులు చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదేమీ కొత్తమీకాదు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత.. ఈటల బీజేపీకి బై బై చెప్పేసి మళ్లీ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ బీజేపీలో విబేధాలు బయటపడం, చేరికల కమిటీ విషయంలో హైకమాండ్ అసంతృప్తిగా ఉందని.. రాజేందర్ అసలేం చేస్తున్నారని గుర్రుగా ఉందని అందుకే ఈ బాధలన్నీ తనకెందుకు అని కాషాయ కండువా తీసేయాలని భావించినట్లుగా రూమర్స్ వచ్చాయి. ఈ వ్యవహారం ఈటల దాకా వెళ్లడంతో బాబోయ్.. తాను బీజేపీని వీడట్లేదని కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని మీడియా మీట్ పెట్టి మరీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్యే ఈటల మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. దీంతో మరోసారి ఈటల గురించి లేనిపోని మాటలు అన్నారని ఇలా వైరల్ చేసేస్తున్నారు. ఇదే అదునుగా అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈటల అంటే పడని కొందరు బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం ఈ ఫొటోలు వైరల్ చేస్తుండటం గమనార్హం.

etela-rajender.jpg

ఏం చేస్తారో మరి..!

అసలే తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయ్. చేరికల గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. ఈటలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇలా రూమర్స్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈటల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇప్పటికే ఈ విషయం ఇటు బీజేపీ హైకమాండ్ దాకా కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. మౌనం పాటించకుండా ఈటల మీడియా మీట్ లేదా కనీసం ప్రెస్‌నోట్ అయినా రిలీజ్ చేస్తే మంచిదేమో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరేమనుకుంటే మనకేంటి అని ఈటల మిన్నకుండిపోతారో లేకుంటే మీడియా ముందుకొస్తారో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

******************************

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

******************************

Updated Date - 2023-05-23T22:33:19+05:30 IST