YSR Congress : జగనన్న వస్తున్నాడంటే అన్నీ నరకాల్సిందే.. ఆ రోజులు మరిచారా..!?

ABN , First Publish Date - 2023-03-02T20:19:00+05:30 IST

‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం...

YSR Congress : జగనన్న వస్తున్నాడంటే అన్నీ నరకాల్సిందే.. ఆ రోజులు మరిచారా..!?

‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం. మనిషి ఆరోగ్యంగా మంచి ఆక్సిజన్‌ (Oxygen) స్వీకరించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా స్వచ్చమైన ఆక్సిజన్‌ తీసుకోలేం.. కానీ ఒక చెట్టు ద్వారా ఎంతో స్వచ్చమైన ఆక్సిజన్‌ తీసుకోవచ్చు.. పచ్చని చెట్లు వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పెద్దలు చెబుతుంటే విన్నాం కదా.. కానీ ఏపీలో (Andhra Pradesh) పరిస్థితి చూస్తే అతి త్వరలోనే దీనికి పూర్తి విరుద్ధమైన మాటలను వినాల్సి వస్తుందేమో. అశోకుడు చెట్లను నాటిస్తే.. ‘జగనన్న అవి కొట్టించెను.. పరదాలు కట్టించెను’ అనే మాట వినాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ ఏపీలో అసలేం జరుగుతోంది..? ఎందుకీ పరిస్థితి తలెత్తింది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Trees-Jagan-1.jpg

అసలేం జరుగుతోంది..!?

‘వృక్షో రక్షతి రక్షితః’ అంటే.. ‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి’. కానీ ఏపీలో మాత్రం పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయ్. ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలు వస్తారు.. ఇక అభిమానులు, అధికార పార్టీ కార్యకర్తల హడావుడి మామూలుగా ఉండదు. మరోవైపు ప్రజలు తమ సమస్యలను సీఎంకు చెప్పుకునేందుకు రెడీ అవుతుంటారు. ఇన్నిరోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిన తమకు పరిష్కారం దొరకలేదు.. కనీసం సీఎంకు అయినా చెబితే న్యాయం జరుగుతుందని భావిస్తారు. కానీ ఏపీలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా చిత్రవిచిత్రాలుగా పరిస్థితులున్నాయ్. సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) తమ ప్రాంతంలో పర్యటిస్తున్నారంటే చాలు.. బాబోయ్ ముఖ్యమంత్రి వస్తున్నారా అని ఆ ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారట. ఇందుకు కారణం ఎక్కడికక్కడ చెట్లు నరికించేస్తున్నారు అధికారులు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని చెప్పి ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలను నరికించేస్తున్నారు అధికారులు. ఈ పరిస్థితి ఒకట్రెండు ప్రాంతాల్లో కాదు.. ఏపీలో జగన్ పర్యటన (CM Jagan Tour) ఎక్కడ ఉంటుందన్నా అక్కడల్లా ఇదే జరుగుతోంది. పర్యావరణాన్ని ఇలా నాశనం చేస్తున్నారెందుకు..? అని అధికారులను అడిగితే.. లేనిపోని సాకులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పలుచోట్ల కేసులు దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయట.

Trees-Jagan-2.jpg

ఇప్పటి వరకూ ఇలా..!

సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి జిల్లాల పర్యటనలకు (CM Jagan District Tour) వస్తున్నారంటే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. భద్రత కారణాలతో పేరుతో అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఏపీలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు చూద్దాం.

- సీఎం వైఎస్ జగన్ విశాఖలో (Vizag) పర్యటిస్తున్నారని పట్టణంలోని చినముషిడివాడ జంక్షన్ నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లను తొలగించేశారు. పెద్ద పెద్ద యంత్రాలతో, కూలీలను పెట్టి మరీ అధికారులు నరికించారు. అటు సాగర్ నగర్ బీచ్ రోడ్డులో కూడా చెట్లు నరికేశారు. తీరా చూస్తే సీఎం పర్యటన సడన్‌గా రద్దయ్యింది. చెట్లు నరికినప్పుడే విశాఖ వాసులు ఆగ్రహానికి లోనవ్వడం.. పైగా సీఎం టూర్ కూడా రద్దవ్వడంతో అసలేం జరుగుతోందని వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఘటనపై విమర్శలు రావడంతో నరికేసిన చెట్ల స్థానంలో చిన్న చిన్న మొక్కలను నాటారు. ఎందుకిలా చేస్తు్న్నారని కొందరు పట్టణవాసులు ప్రశ్నించగా.. శారదా పీఠం వార్షికోత్సవాల కోసం సీఎం వస్తున్నారని అందుకే సుందరీకరణ, భద్రతా చర్యల్లో భాగంగా ఇలా చేసినట్లు చాలా సింపుల్‌గా తేల్చేశారు.

- ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరిలో (Guntur Mangalagiri) సీఎం జగన్ పర్యటన ఉండగా.. రోడ్లకు ఇరువైపులా ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలను నరికేశారు. దీనికి కూడా భద్రత పేరు చెప్పి, రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ఇలా చేశామని చేతులుదులుపుకుంటున్నారు అధికారులు. అంతేకాదు.. రోడ్డు సైడ్‌ చిరు వ్యాపారులను సైతం మూడ్రోజుల ముందు నుంచే దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఇదేమిటని నిలదీయగా తోపుడు బండ్లని బలవంతంగా మార్కెట్ యార్డుకు తరలించేశారు.

- గుంటూరు జిల్లా తెనాలి వాసులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తెనాలిలో (Tenali) నాలుగు వరుసల రహదారి తరహాలో విశాలమైన రోడ్డు ఉంది. వాహనాలు వెళ్లడానికి ఎటువంటి ఆటంకం లేదు. అయినా సరే భద్రతా కారణాల పేరుతో రోడ్డు పక్కన ఉన్న కొన్నేళ్ల నాటి మహావృక్షాలను నరికేశారు. చెట్లను నరకడం కోసం పక్కనే ఉన్న జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు ఇబ్బందవుతుందన్న ఆలోచన కూడా లేకుండా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. పట్టణంలో సభావేదికకు అటు, ఇటు మూడు కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రావటానికి వీలు లేకుండా కట్టడి చేసేశారు. ఇదే సభలో ఏర్పాట్లలో అలంకారం కోసం మొక్కజొన్న కంకులకు పార్టీ రంగులను వేయడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా పెద్దఎత్తునే వైరల్ అయ్యాయి.

- నిడదవోలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆయన నిడదవోలు వస్తున్నారని తెలిసి పట్టణంలో అధికారులకు ఏం చేస్తున్నారో తెలియడం లేదు.. అంతా హడావుడే.. ఉరుకులు పరుగులు పెట్టారు. అందదు కానీ ఆకాశానికి రంగులు వేసేసేలా ప్రవర్తించారు. నిన్నటి వరకూ పట్టణంలో పచ్చగా కళకళలాడిన చెట్లను నరికించేశారు. పట్టణంలో చాలా ఏళ్లగా ఉన్న పచ్చదనానికి పాతర వేశారు. కొన్ని చెట్లను వేళ్లతో సహా పెకిలించేయగా.. మరికొన్ని పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను నరికేశారు.

Trees-Jagan-3.jpg

ప్రకృతితోనే పరాచకాలా..?

విశాఖపట్నంను ప్రశాంత వాతావరణం, పచ్చదనానికి మారుపేరుగా ఆ జిల్లా వాసులు చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు విశాఖలో ఎక్కడ చూసినా కొండలు, పచ్చదనంతో ఉండేది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక కొండలను తొలిచి వేస్తున్నారని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వీఐపీల పర్యటనల పేరుతో చెట్లను నరికేస్తున్నారు. చెట్లు పెరగడానికి సంవత్సరాలు పడితే, క్షణాల్లో వాటిని తొలగించేస్తున్నారు. మరోవైపు.. వైజాగ్ నగరానికి వన్నె తెచ్చే రుషికొండపై (Rushikonda) ఉన్న పచ్చదనాన్ని తొలగిస్తూ కాటేజీల నిర్మాణం చేపడుతోంది జగన్ సర్కార్ (Jagan Govt). అసలు ఇది ఎంతవరకు సమంజసం అని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు, గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కూడా రుషికొండపై తవ్వకాలు విషయంలో ఇంకా కేసులు నడుస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ సమావేశాలు జరుగుతుండటంతో కొండ ప్రాంతానికి కృత్రిమ రంగులు అద్ది నానా రచ్చ చేశారు. అంతేకాదు.. తవ్వకాల గాయాలు కనిపించకుండా జియో మ్యాటింగ్ పనులు చకచకా చేపట్టారు. జగన్‌ రుషికొండపై కన్నేశారని, ఆయన కన్ను పడితే కొండలైనా కరిగిపోవాల్సిందేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ పర్యావరణాన్ని రక్షిస్తుంటే.. జగన్ మాత్రం అదే ప్రకృతితో పరాచకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Trees-Jagan.jpg

ఇక్కడే ఎందుకిలా..?

దేశం మొత్తం చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటే ఏపీలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో హరితహారం పేరుతో మొక్కలు పెద్దఎత్తున పెంచుతున్నారు. ఎక్కడైనా చెట్టు నరికినట్లు తెలిసినా.. పశువులు మేసినట్లు తెలిసినా ఆ యజమానులకు భారీగా జరిమానా విధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ (MP Santhosh) అయితే గ్రీన్ ఛాలెంజ్ (Green Challange) కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వేలాది మంది సినీ, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా జరుగుతుంటే ఏపీలో చెట్లను నాటకపోగా.. ఉన్న చెట్లను కొట్టేస్తున్నారంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Rishikoda.jpg

చట్టం ఏం చెబుతోంది.. ఆ పరిస్థితులు మరిచారా..?

వాస్తవానికి నిబంధలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతి లేకుండా చెట్టును తొలగించడం నేరమే. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రూ. 10 వేలు అపరాధ రుసుం, 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే ఇప్పటి వరకూ ఏపీలో ఎన్నిచెట్లను నరికేశారో.. పోలీసులు ఏ మాత్రం కేసులు పెట్టారో పైనున్న పెరుమాళ్లకే ఎరుక. ఇక కొవిడ్ సమయంలో ఆక్సిజన్ కోసం అల్లాడిపోయిన రోజులు జగన్ సర్కార్ పూర్తిగా మర్చిపోయినట్లుందని తాజా పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఏళ్లుగా ఉన్న చెట్లను నరికేసి.. కృత్రిమంగా సుందరీకరణ చేయడం వల్ల ప్రయోజనం ఏంటో ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పటికే విశాఖకు ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పలుమార్లు మీడియా ముందుకొచ్చి చెప్పిన దాఖలాలు చాలానే ఉన్నాయ్.

ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రకృతిపై పగపట్టినట్లుగా చెట్లను నరకడం మాని.. పర్యావరణాన్ని రక్షిస్తే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పక చెట్లు నరకాల్సి వస్తే.. కొమ్మలు, కాండాలను తొలగిస్తే సరిపోతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ చెట్ల నరికివేత కార్యక్రమం ఆపకపోతే మాత్రం భవిష్యత్‌లో చాలా పరిణామాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇందులో సందేహాలు అక్కర్లేదేమో..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

పెను విషాదం.. గుండెపోటుతో టీడీపీ ఎమ్మెల్సీ కన్నుమూత..

******************************

Naveen Murder Case : నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. ఇంత జరిగినా...

******************************
TS Congress : కొడంగల్ నుంచే పోటీచేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి పరిస్థితేంటి.. పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా..!?


******************************

Lokesh Yuva Galam : మునిరాజమ్మా.. మీ తెగువకు వందనం.. ఆత్మగౌరవ ప్రతీక‌గా నిలిచారన్న చంద్రబాబు.. అసలేం జరిగిందంటే..!

******************************

Naveen Murder Case : నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. ఇంత జరిగినా...

******************************

******************************

YuvaGalam Padayatra : నారా లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో.. అసలేం జరిగిందంటే..!

******************************

YSR Congress : చేతులెత్తేసిన వైఎస్ జ‌గ‌న్... ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా.. ఆ ఒక్క మాటతో..!?

******************************

Vangaveeti Radha: వంగవీటి రాధా పార్టీ మారుతున్నారా.. ముహూర్తం కూడా ఫిక్సయ్యిందా.. ఓహో మాస్టర్ ప్లాన్ ఇదా..!?

******************************

Telugudesam : టీడీపీ వైపు మాజీ మంత్రి చూపు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలని ప్లాన్.. ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!

******************************

Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్

******************************

Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

******************************

Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

******************************

TS Congress : ‘కోమటిరెడ్డి ఎవడు.. నాకు తెలియదు..’ ఎంపీని షబ్బీర్ అలీ ఇంత మాట అనేశారేంటి.. ఎందుకింత రచ్చ..!?

******************************
Viveka Murder Case : పీకలదాకా వచ్చేసరికి సిల్లీ లాజిక్స్ ఏంటి సజ్జలా.. అసలేంటీ మాటలు.. నవ్వుకుంటున్నారు బాబోయ్..!

******************************
Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!

******************************

Updated Date - 2023-03-03T10:16:14+05:30 IST