TS Assembly Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. ఈ దెబ్బతో..!?

ABN , First Publish Date - 2023-09-17T21:13:38+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కదనరంగంలోకి దూకేశాయి. భారీ బహిరంగ సభలు, కీలక ప్రకటనలు.. ఎన్నికల హామీలతో దూసుకెళ్తున్నాయి. అందరికంటే ..

TS Assembly Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. ఈ దెబ్బతో..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కదనరంగంలోకి దూకేశాయి. భారీ బహిరంగ సభలు, కీలక ప్రకటనలు.. ఎన్నికల హామీలతో దూసుకెళ్తున్నాయి. అందరికంటే ముందుగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను (BRS) ప్రకటించిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని అందుకు తగ్గట్టుగా ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో ముందుకెళ్తున్నారు. అయితే.. అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారం మాత్రం ఇంకా ప్రారంభించలేదు. దీంతో ఒక్కడుగు ముందుకేసిన కాంగ్రెస్.. ఒక్క అభ్యర్థుల ప్రకటన తప్ప.. ఎన్నికల సభలు, హామీలు, మేనిఫెస్టోలో ఒక్కొక్కటి ప్రకటించుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ‘విజయభేరి’ (VijayaBheri) సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లిఖార్జున ఖర్గే (MalliKharjuna Kharge) తరలివచ్చారు. విజయభేరి సభా వేదికగా ఎన్నికల హామీలను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. ఇప్పుడీ ప్రకటనలపై తెలంగాణలో పెద్ద చర్చే జరుగుతోంది.


Congress-Vijayabheri.jpg

ఇంతకీ ఏం ప్రకటించారు..?

ఈ సభావేదికగా సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ ఏమేం కీలక ప్రకటనలు చేశారనే విషయాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ కీలక వాగ్దానాలు ఇచ్చింది.

6 గ్యారంటీ పథకాలు :-

 • గృహ జ్యోతి : ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్

 • రైతు భరోసా : భూమి ఉన్న రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ఏటా రూ.15,000

 • గుంట భూమి లేని కూలీలకు ఏటా రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్

 • చేయూత : రూ.4,000 పెన్షన్

 • ఇందిరమ్మ ఇళ్లు : ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలుఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం

 • మహాలక్ష్మి : ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ.500కి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

 • యువ వికాసం : విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.

Congress-Hameelu.jpg

సోనియా గాంధీ :-

 • తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

 • చారిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు గ్యారెంటీలు ఇస్తున్నాం

 • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తాం

 • రూ.500లకే మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు

 • ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రావ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం

 • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గ్యారెంటీలను అమలు చేస్తాం

Sonia-Gandhi.jpg

రాహుల్‌ గాంధీ :-

 • తెలంగాణలో BRS, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి

 • రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో అవగాహన ఉండాలి

 • ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు

 • తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తుంది

 • ఒక్క కుటుంబం కోసమే సోనియా తెలంగాణ ఇవ్వలేదు

 • BRS పాలనలో పేదలకు మేలు జరగలేదు

 • ప్రజలకు గ్యారెంటీ తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌

 • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను నెరవేరుస్తాం

Rahul.jpeg

అంతా దోపీడీనే..

 • BRS ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్‌గాంధీ

 • కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్లు దోపిడీ

 • ధరణి పోర్టల్‌ ద్వారా పేదల భూములు లాక్కుంటున్నారు

 • TSPSC పేపర్లు లీక్‌ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు

 • తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

 • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం

మల్లిఖార్జున ఖర్గే:

 • సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు

 • తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలను ప్రకటిస్తోంది

 • రైతు భరోసా కింద రూ.15 వేలు పెట్టుబడి సాయం

 • కౌలురైతులకు రూ.12 వేలు సాయం

 • వరికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్‌

 • వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

 • ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌

 • ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం

 • ఉపాధిహామీ చట్టం చేసింది కాంగ్రెస్సే

 • ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్‌ అని ఖర్గే చెప్పుకొచ్చారు.

Kharge.jpeg

‘కారు’ పంచరయ్యేలా..?

ఇన్నిరోజులు కాంగ్రెస్‌ను పెద్దగా లెక్కచేయని కేసీఆర్ (CM KCR).. ఒక్కసారిగా సోనియా, రాహుల్ ఇలా ప్రకటనలు చేసే సరికి మైండ్ బ్లాంక్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కీలక ప్రకటనలతో కచ్చితంగా ‘కారు’ పంచర్ కావడం పక్కా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లోనూ ఇలానే స్ట్రాటజీగా ముందుకెళ్లడంతో కాంగ్రెస్ ఊహించని రీతిలో గెలిచిందని.. తెలంగాణలోనూ అదే ఫార్ములాను వ్యూహకర్త సునీల్ కనుగొలు ఫాలో అయిపోతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో ‘పే సీఎం’.. మాదిరిగా తెలంగాణలో ‘బుక్ మై సీఎం’ అనే ప్రకటనలతో కేసీఆర్ అంటే ఏంటో.. ప్రజలకు ఏ మాత్రం చేశారనే విషయాలను ఇలా పోస్టర్లు, బ్యానర్లు ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా విజయభేరి సభలో ఇలా కాంగ్రస్ ‘సిక్సర్’ కొట్టడంతో .. కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారా..? ఈ ప్రకటనలపై ఎలా రియాక్ట్ కాబోతున్నారా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Revanth-Kishan-And-KCR.jpg


ఇవి కూడా చదవండి


TS Assembly Polls : ఇలాగైతే కష్టమే.. తెలంగాణ కీలక నేతలకు ‘షా’ స్ట్రాంగ్ వార్నింగ్


NCBN Arrest : లోకేష్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..?


NCBN Arrest : చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క సీన్‌తో చెప్పేయొచ్చు!


NCBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై స్పందించిన వైఎస్ జగన్.. షాకిచ్చిన జనం


Updated Date - 2023-09-17T21:24:24+05:30 IST