Bathukamma: సింగపూర్ బతుకమ్మ సంబురాలు షురూ

ABN , First Publish Date - 2023-10-11T08:09:07+05:30 IST

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు.

Bathukamma: సింగపూర్ బతుకమ్మ సంబురాలు షురూ

ఎన్నారై డెస్క్: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు. ఒక్కొక్క పువ్వును శ్రద్దతో రాశులుగా పేరుస్తూ ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సు కోసం ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సింగపూర్ తెలుగు సమాజం (Singapore Telugu Samajam) ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగను అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్ నందు జరుపుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దసరా పండుగ ముందు వచ్చే వారాంతం కనుక కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి స్వాతి కోరారు.

ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత గాయని వరమ్ ప్రత్యక్ష గానం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ పసందైన భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పారు. అంతేగాక మొదటి 3 ఆకర్షణీయమైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. ఒక లక్కీ విజేతకు 5 గ్రా౹౹ బంగారం బహుమతిగా ఇస్తున్నామని కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. సింగపూర్‌లోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేక రవాణా (బస్) ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు జయప్రదంగా జరగాలని తెలుగువారందరూ ఆకాంక్షిస్తున్నారు.

Singapore-B.jpg

Updated Date - 2023-10-11T08:09:07+05:30 IST