Schengen visa for Indian travellers: భారతీయ పర్యాటకులకు జర్మనీ శుభవార్త.. ఇకపై..

ABN , First Publish Date - 2023-08-10T07:29:16+05:30 IST

జర్మనీలో పర్యటించేందుకు అవసరమైన షెంజెన్‌ వీసాకు వేచి చూసే కాలం ఇప్పుడు 8వారాలకు తగ్గిందని భారత్‌లోని జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ జార్జ్‌ ఎన్జ్‌వీలర్‌ తాజాగా తెలిపారు.

Schengen visa for Indian travellers: భారతీయ పర్యాటకులకు జర్మనీ శుభవార్త.. ఇకపై..

షెంజెన్‌ వీసా ఇక 8 వారాల్లోనే

జర్మనీ రాయబార కార్యాలయం వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 9: జర్మనీలో పర్యటించేందుకు అవసరమైన షెంజెన్‌ వీసాకు వేచి చూసే కాలం ఇప్పుడు 8వారాలకు తగ్గిందని భారత్‌లోని జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ జార్జ్‌ ఎన్జ్‌వీలర్‌ తాజాగా తెలిపారు. మున్ముందు మరింతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నామని బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘వీసా జారీ అనేది చాలా కీలక అంశంగా మారింది. దరఖాస్తును వేగంగా చూసేందుకు, త్వరగా జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకు మా ముంబై కార్యాలయంలో సిబ్బందిని కూడా గణనీయంగా పెంచాం’’ అని ఆయన స్పష్టం చేశారు. 27 ఐరోపా దేశాల్లో పర్యాటకం లేదా వ్యాపార నిమిత్తం పర్యటించాలనుకునేవారికి 90 రోజుల వ్యవధి కలిగిన షెంజెన్‌ వీసాను జారీ చేస్తారు. జర్మన్‌ జాతీయ పర్యాటక కార్యాలయం వివరాల ప్రకారం గత ఏడాది జర్మనీలో 6.23 లక్షలమంది భారతీయులు పర్యటించారు. చివరిగా 2019లో 9.6 లక్షలమంది దేశంలో పర్యటించగా.. కొవిడ్‌ తర్వాత గత ఏడాదే పర్యాటకుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించిందని జీఎన్‌టీఓ పేర్కొంది.

Updated Date - 2023-08-10T07:29:16+05:30 IST