Share News

Amit Patel: విలాసాల కోసం ఎన్నారై తప్పుదోవ.. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్‌కు రూ.183కోట్లు టోకరా!

ABN , First Publish Date - 2023-12-08T09:45:59+05:30 IST

NRI Steals Rs 183 Crore: విలాసాలకు అలవాటు పడిన ఓ ఎన్నారై పెడదారిలో డ‌బ్బు సంపాదించాడు. దీనికోసం గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసిన యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌ (Jacksonville Jaguars) కు ఏకంగా 22 మిలియన్ డాలర్లు టోకరా పెట్టాడు. మన కరెన్సీలో అక్షరాల రూ.183 కోట్లు.

Amit Patel: విలాసాల కోసం ఎన్నారై తప్పుదోవ.. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్‌కు రూ.183కోట్లు టోకరా!

NRI Steals Rs 183 Crore: విలాసాలకు అలవాటు పడిన ఓ ఎన్నారై పెడదారిలో డ‌బ్బు సంపాదించాడు. దీనికోసం గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసిన యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌ (Jacksonville Jaguars) కు ఏకంగా 22 మిలియన్ డాలర్లు టోకరా పెట్టాడు. మన కరెన్సీలో అక్షరాల రూ.183 కోట్లు. అమెరికాలో ఉండే అమిత్ పటేల్ (Amit Patel) అనే ఎన్నారై ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. అలా తప్పుదోవలో వచ్చిన డబ్బులతో మనోడు జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖ‌రీదైన టెస్లా కారు, విలువైన చేతి గ‌డియారాలు, క్రిప్టో కరెన్సీ(Crypto Currency) కొన్నాడు. అలాగే ఎక్కడికివెళ్లినా చార్టెడ్ ఫ్లైట్స్ (Chartered flights) లోనే ప్రయాణించేవాడట. ఇక విహారయాత్రలకు కొదవే లేదు. దుబారాగా కోట్ల డబ్బులు తగిలేశాడు.

ఇది కూడా చదవండి: NRI: బీబీసీ ఛైర్మన్‌గా ఎన్నారైని నామినేట్ చేసిన యూకే.. అసలు ఎవరీ సమీర్ షా...

ఎలా కాజేశాడంటే..?

జాక్సన్‌విల్లే జాగ్వార్స్ అనేది యూఎస్‌లోని పాపుల‌ర్ ఫుట్‌బాల్ జట్లలో ఒక‌టి. ఈ ఫ్రాంచైజీలో ఆర్థిక విశ్లేష‌ణ‌, ప్లానింగ్ టీమ్‌కు 2018 నుంచి 2023 వ‌ర‌కు మేనేజ‌ర్‌గా ప‌ని చేశాడు. ఈ ఫ్రాంచైజీ త‌న ఉద్యోగుల కోసం వ‌ర్చువ‌ల్ క్రెడిట్‌ కార్డు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే అమిత్ భారీ మోసానికి తెర‌లేపాడు. విమాన చార్జీలు, హోట‌ల్ బిల్లులు, క్యాట‌రింగ్ వంటి వాటికి న‌కిలీ బిల్లుల‌ను సృష్టించడం చేశాడు. ఇలా వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డు ను దుర్వినియోగం చేసిన అతడు ఐదేళ్లలో ప్రాంఛైజీ యాజమాన్యానికి తెలియకుండా ఏకంగా రూ.183కోట్లు కాజేశాడు. అడ్డదారిలో వచ్చిన ఈ డబ్బులతో అత‌డు ఫ్లోరిడాలో ఓ భారీ ఇంటిని కొన్నాడు. అలాగే ఖ‌రీదైన గ‌డియారాలు, ప్రైవేట్ జెట్స్, టెస్లా కారు (Tesla), విదేశాల్లో జల్సాలు చేశాడు. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావడంతో జాక్సన్‌విల్లే యాజమాన్యం అమిత్‌ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. అలాగే న్యాయస్థానంలో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. కాగా, అమిత్ ఒక్కడే ఈ భారీ మోసానికి పాల్పడ్డాడని, ఫ్రాంచైజీలోని మిగితా ఉద్యోగులు ఎవ‌రూ కూడా అత‌నికి స‌హ‌క‌రించ‌లేద‌ని యాజమాన్యం వెల్లడించింది.

ఇది కూడా చదవండి: NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-08T09:48:20+05:30 IST