Golden Visa: ప్రముఖ సీనియర్ నటి కుమార్తెకు యూఏఈ 'గోల్డెన్ వీసా'..!

ABN , First Publish Date - 2023-03-22T10:29:27+05:30 IST

ఒకప్పటి సీనియర్ నటి రాధ(Radha) కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్‌‌కు (Karthika Nair) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో అరుదైన గౌరవం దక్కింది.

Golden Visa: ప్రముఖ సీనియర్ నటి కుమార్తెకు యూఏఈ 'గోల్డెన్ వీసా'..!

ఎన్నారై డెస్క్: ఒకప్పటి సీనియర్ నటి రాధ(Radha) కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్‌‌కు (Karthika Nair) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆమె దుబాయిలో గోల్డెన్ వీసా (Golden Visa) అందుకుంది. కాగా, అక్కినేని నాగచైతన్య నటించిన 'జోష్' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' మూవీలో నటించింది. ఈ సినిమా బోల్తా పడడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. అటు సొంత భాష తమిళంలోనూ హీరోయిన్‌గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మలయాళ భాషల్లో నటించిన ఫలితం లేకుండాపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యాపారం వైపు అడుగు వేసింది.

'ఉదయ్‌ సముద్ర గ్రూప్‌' ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, కొన్నేళ్లుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో కీలక పాత్ర పోషించింది. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే స్థిరపడి, యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తీకకు అక్కడి ప్రభుత్వం తాజాగా గోల్డెన్‌ వీసాతో సత్కరించింది. దుబాయిలోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూఏఈకి చెందిన అధికార ప్రతినిధి హమద్‌ అల్మన్సూరి( Hamad Almansoori ) ఆమెకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేసింది. యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యూఏఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!

కాగా, ఇప్పటికే పలువురు మలయాళ, బాలీవుడ్ స్టార్స్ యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయం విదితమే. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్, సోను నిగమ్, వరుణ్ ధావన్‌ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు నటి త్రిషా, సీనియర్ గాయని కేఎస్ చిత్ర, క్రీడాకారిణి సానియా మీర్జా కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. అలాగే కొణిదేల వారి కోడలు, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన సైతం ఈ గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: నారింజ పండ్లు ఎంత పనిచేశాయి.. సౌదీలో తెలుగు ఎన్నారైకి ఊహించని అనుభవం.. అటు ఉన్న ఉద్యోగం ఊడి.. ఇటు స్వదేశానికి రాలేని పరిస్థితి..!

అసలు ‘గోల్డెన్ వీసా’ వల్ల ప్రయోజనాలేమిటీ?

ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర ఎమిరేట్స్‌లో పదేళ్ల వరకు నివసించే వెసులుబాటు ఉంటుంది. విదేశీయులకు లాంగ్‌టర్మ్ రెసిడెన్సీకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యూఏఈ సర్కార్ 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది. అంతేగాక ఈ వీసా ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. ఇక ఈ వీసా కలిగిన వ్యక్తులు తమ భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అబుదాబీలో పదేళ్లు నివసించవచ్చు. గోల్డెన్ వీసా హోల్డర్లు వంద శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే, ఈ వీసాను పొందడం సామాన్యులకు సాధ్యం కాదు. 2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి ఎంతో పాపులారిటీ ఉంటేనే ఈ వీసాకు అర్హత సాధిస్తారు.

ఇది కూడా చదవండి: ఎంట్రీ, రెసిడెన్సీ, వర్క్ పర్మిట్లు.. ఇలా పది సర్వీసులు ఒకేచోట.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా..

Updated Date - 2023-03-22T10:31:43+05:30 IST