UAE Govt Portal: ఎంట్రీ, రెసిడెన్సీ, వర్క్ పర్మిట్లు.. ఇలా పది సర్వీసులు ఒకేచోట.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా..

ABN , First Publish Date - 2023-03-22T09:33:09+05:30 IST

ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా పది సర్వీసులను ఒకేచోట పొందే వెసులుబాటును యూఏఈ రాజదాని అబుదాబి తన నివాసితులు, పౌరులకు కల్పించింది.

UAE Govt Portal: ఎంట్రీ, రెసిడెన్సీ, వర్క్ పర్మిట్లు.. ఇలా పది సర్వీసులు ఒకేచోట.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా..

అబుదాబి: ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా పది సర్వీసులను ఒకేచోట పొందే వెసులుబాటును యూఏఈ రాజదాని అబుదాబి తన నివాసితులు, పౌరులకు కల్పించింది. ఎంట్రీ (Entry), రెసిడెన్సీ (Residency), వర్క్ పర్మిట్లు (Work Permits).. ఇలా పది సర్వీసులు ఒకేచోట పొందవచ్చు. ఈ మేరకు తాజాగా అబుదాబి తన ఏకీకృత సేవల వ్యవస్థ టీఏఎంఎం(TAMM) అమలులోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇప్పుడు తన మొదటి బ్యాచ్ సేవలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పలు మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) సేవలు పర్యావరణ వ్యవస్థకు జోడించబడ్డాయి. దీంతో ఇది టీఏఎంఎం ద్వారా తన సేవలను అందించే మొదటి సమాఖ్య సంస్థగా నిలిచింది. ప్రస్తుత ప్రయోగ దశలో భాగంగా టీఏఎంఎం 10 ఎంఓహెచ్ఆర్ఈ (MoHRE) సేవలను అందిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌తో కస్టమర్‌లు మరింత అలవాటు పడిన తర్వాత మరిన్ని ఎంఓహెచ్ఆర్ఈ సర్వీసులు జోడించనుంది.

1. కొత్త వర్క్ పర్మిట్ జారీ చేయడం

2. గృహ కార్మికుల కోసం కొత్త ప్రవేశ అనుమతిని జారీ చేయడం

3. గృహ కార్మికుల కోసం కొత్త నివాస అనుమతిని జారీ చేయడం

4. గృహ కార్మికుల కోసం రెసిడెన్సీ అనుమతిని పునరుద్ధరించడం

5. గృహ కార్మికులకు నివాస అనుమతిని రద్దు చేయడం

6. గృహ కార్మికుల స్పాన్సర్‌షిప్ ఫైల్‌ను తెరవడం

7. గృహ కార్మికుల స్థితిని మార్చడం

8. గృహ కార్మికుల కోసం కొత్త వర్క్ కాంట్రాక్ట్ జారీ చేయడం

9. గృహ కార్మికుల కోసం పని ఒప్పందాన్ని సవరించడం

10. గృహ కార్మికుల ప్రవేశ అనుమతిని రద్దు చేయడం

ఇది కూడా చదవండి: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!

అబుదాబి గవర్నమెంట్ యూనిఫైడ్ సర్వీసెస్ ఎకోసిస్టమ్ టీఏఎంఎం అనేది ఈ ప్రాంతంలో మొదటిది. ఇది సరికొత్త వినూత్న సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా పలు సర్వీసులను ఒకేచోట ఉపయోగించడానికి సులభమైందిగా మారింది. ఇది వినియోగదారులకు ప్రభుత్వ సేవలను అందించే విధానాన్ని మారుస్తుంది, ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా వారి ప్రభుత్వ లావాదేవీలను సజావుగా నిర్వహించడానికి వారికి అవకాశం ఇస్తుంది.

ఇది కూడా చదవండి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష!

Updated Date - 2023-03-22T09:34:42+05:30 IST