Share News

NRI Homecoming festival: ఎన్నారైల కోసం ఇండస్‌ఇండ్ బ్యాంక్ సూపర్ స్కీమ్.. అదిరిపోయే ప్రయోజనాలు..

ABN , First Publish Date - 2023-11-05T11:12:12+05:30 IST

విదేశాలలో ఉంటూ త్వరలో స్వదేశాన్ని సందర్శించాలనే ఆలోచనలో ఉన్న ఎన్నారైలా మీరు? (Non-Resident Indians). అయితే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మీ కోసం ఓ సూపర్ స్కీమ్‌ను అందిస్తుంది.

NRI Homecoming festival: ఎన్నారైల కోసం ఇండస్‌ఇండ్ బ్యాంక్ సూపర్ స్కీమ్.. అదిరిపోయే ప్రయోజనాలు..

ఎన్నారై డెస్క్: విదేశాలలో ఉంటూ త్వరలో స్వదేశాన్ని సందర్శించాలనే ఆలోచనలో ఉన్న ఎన్నారైలా మీరు? (Non-Resident Indians). అయితే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మీ కోసం ఓ సూపర్ స్కీమ్‌ను అందిస్తుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ మీరు మీ స్వదేశానికి తిరిగి రావడం సెలబ్రేట్ చేసుకునేలా ‘ఎన్నారై హోమ్‌కమింగ్ ఫెస్టివల్’ (NRI Homecoming Festival) పేరిట ప్రత్యేక ప్రోగ్రామ్‌‌ను లాంచ్ చేసింది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 (ICC Men's Cricket World Cup 2023), ఈ ఇయర్ ఎండింగ్ హాలీడే సీజన్, వచ్చే ఏడాది జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో మీ బసను మరింత ఆనందదాయకంగా మార్చడంతో పాటు బోలెడు ప్రయోజనాలు కలిగేలా బ్యాంక్ వారు ప్లాన్ చేశారు. ఇంతకీ ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) అందిస్తున్న 'ఎన్నారై హోమ్‌కమింగ్' ప్రోగ్రామ్ ద్వారా ఎన్నారైలకు కలిగే అదిరిపోయే ప్రయోజనాలెంటో ఒకసారి చూద్దాం..

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

NRE/NRO సేవింగ్స్ ఖాతాలపై వార్షిక వడ్డీ రేటు అనేది ఏకంగా 6.75 శాతం వరకు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నారైలకు ఉన్న అత్యధిక ధరల్లో ఇది ఒకటి. అలాగే NRE/NRO డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 7.5 శాతం వరకు పొందవచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు సేవింగ్స్‌ను పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూఎస్‌డీ ఎఫ్‌సీఎన్ఆర్ (USD FCNR) డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును 5.95 శాతం వరకు పొందవచ్చు. విదేశీ కరెన్సీలో తమ నిధులను ఉంచాలనుకునే ఎన్నారైలకు ఇది ది బెస్ట్ చాయిస్ కూడా. అయితే, ఈ ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అందుకే వీలైనంత త్వరగా ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం బెటర్.

Kuwait: ప్రవాసులకు కువైత్ ఝలక్.. వర్క్ పర్మిట్ రెన్యువల్‌ నిలిపివేత..!

ఇవే కాకుండా ఎన్నారైల కోసం ఇండస్‌ఇండ్ బ్యాంక్ కొన్ని బంపర్ పండుగ ఈవెంట్‌లను కూడా ప్లాన్ చేసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న 198 ఎన్నారై కేంద్రీకృత శాఖలలో దేనినైనా సందర్శించి క్విజ్‌లు, గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా అద్భుతమైన బహుమతులు, వోచర్‌లను గెలుచుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ఫైనాన్షియల్ నిపుణులు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యతపై ఫ్రీ సెషన్‌లో పాల్గొనవచ్చు. తద్వారా విదేశాలకు తిరిగి వెళ్లే ముందు మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి? మీ లక్ష్యాలను ఎలా సాధించాలి? తదితర విషయాలను తెలుసుకోవచ్చు. ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ (IndusInd Bank Digital Platform) ద్వారా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. వాట్సప్ బ్యాంకింగ్, ఫింగర్ ప్రింట్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లతో ఆన్‌లైన్‌లో ఎన్నారైలు తమ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఇండస్ ఫాస్ట్ రెమిట్‌ ద్వారా అమెరికా, సింగపూర్ నుంచి స్వదేశంలో ఉన్న మీ వాళ్లకు ఛాలా సులభంగా నిధులను పంపించుకోవచ్చు. ఇక సహాయం కోసం 24×7 కాల్ సెంటర్‌ సర్వీస్, వర్చువల్ సర్వీస్ బృందం అందుబాటులో ఉంటాయి.

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

Updated Date - 2023-11-05T11:12:14+05:30 IST