Share News

NRI: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం.. సింగపూర్‌లో భారతీయుడికి 16 ఏళ్ల జైలు.. 12 బెత్తం దెబ్బలు

ABN , First Publish Date - 2023-10-29T07:18:01+05:30 IST

కాలేజీ విద్యార్థిని (College Student) పై అత్యాచారానికి పాల్పడిన భారతీయుడి (Indian) కి సింగపూర్ న్యాయస్థానం 16 ఏళ్లు జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష విధించింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది.

NRI: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం.. సింగపూర్‌లో భారతీయుడికి 16 ఏళ్ల జైలు.. 12 బెత్తం దెబ్బలు

NRI: కాలేజీ విద్యార్థిని (College Student) పై అత్యాచారానికి పాల్పడిన భారతీయుడి (Indian) కి సింగపూర్ న్యాయస్థానం 16 ఏళ్లు జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష విధించింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ అత్యాచార కేసుపై తాజాగా సింగపూర్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2019లో సింగపూర్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి రాత్రి పూట ఇంటికి వెళ్లేందుకు బస్ట్ స్టాప్‌కు వెళ్తోంది. విద్యార్థిని ఒంటరిగా వెళ్తుండడం గమనించిన చిన్నయ్య (Chinnaiah) అనే భారత వ్యక్తి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దాంతో భయపడిన ఆమె దారి మళ్లింది. ఇదే అదునుగా చిన్నయ్య ఆమెను వెంబడించాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిని రైల్వే స్టేషన్ వైపు వెళ్లాలని ప్రయత్నించింది. అలా ఆమె రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న క్రమంలో చిన్నయ్య దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా కొట్టి ఆమెను దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లాడు.

India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!

అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బాధితురాలు తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఉన్న చోటును అతనికి తెలియజేసింది. దాంతో స్నేహితుడు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అనంతరం గాలించి నిందితుడు చిన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కోర్టులు ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నాలుగేళ్లు గడిచినా బాధితురాలు ఇప్పటికీ ఈ ఘటన వల్ల మానసికంగా బాధ పడుతుందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. చిన్నయ్యను దోషిగా నిర్ధారించిన కోర్టు.. తాజాగా తీర్పును వెల్లడించింది. నిందితుడు చిన్నయ్యకు 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు తినాలని ఆదేశించింది.

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!


Updated Date - 2023-10-29T07:18:45+05:30 IST