Rs 2000 Rupee Notes: ఒమాన్‌లోని భారత ప్రవాసులకు కొత్త చిక్కు.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు..!

ABN , First Publish Date - 2023-06-01T08:52:30+05:30 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 'క్లీన్ నోట్ పాలసీ‌'లో భాగంగా ఇటీవల రూ.2వేల కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Rs 2000 Rupee Notes: ఒమాన్‌లోని భారత ప్రవాసులకు కొత్త చిక్కు.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు..!

మస్కట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 'క్లీన్ నోట్ పాలసీ‌'లో భాగంగా ఇటీవల రూ.2వేల కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 2వేల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఈ గడువులోపు ఈ కరెన్సీ నోట్లు ఉన్నవారు ఆర్‌బీఐ శాఖల్లోగానీ, ఇతర బ్యాంకుల వద్ద గానీ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒమాన్‌లో ఉంటున్న భారత ప్రవాసులకు (Indian Expats) ఈ నోట్ల మార్పిడి వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా పరిణమించింది. ఎందుకంటే స్థానిక ఎక్స్ఛేంజ్ సంస్థలు నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నాయట. దీంతో సుల్తానేట్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు డైలమాలో ఉన్నారు. చాలా మందికి రూ.2వేల నోట్ల మార్పిడి కోసం స్వదేశానికి రావడం సాధ్యపడదు. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో వారి వద్ద ఉన్న కరెన్సీకి రెండింతలు లేదు మూడు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.

ఇక కొంతమంది ప్రవాసులు ఇటీవల తమ సెలవులను ముగించుకుని ఇప్పటికే సుల్తానేట్‌కు తిరిగి వచ్చేశారు కూడా. దాంతో అలాంటి వారికి సమీప భవిష్యత్‌లో మళ్లీ స్వదేశానికి వెళ్లే అవకాశం దొరకదని గ్లోబల్ మనీ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్ అమిత్ తాలుక్‌దర్ అభిప్రాయపడ్డారు. కాగా, 'క్లీన్ నోట్ పాలసీ'లో (Clean Note Policy) భాగంగా ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో రూ.2వేల నోట్లను జమ చేసుకోవచ్చు. లేదా వాటిని ఇండియాలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచీలో ఇతర డినామినేషన్ నోట్లుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఏడాది మే 23 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Open Work Permit: ఫ్యామిలీతో సహా కెనడాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే..!


Updated Date - 2023-06-01T08:53:45+05:30 IST