Indian Embassy in Kuwait: భారతీయ కార్మికులకు ఎంబసీ కీలక సూచన.. ఎట్టిపరిస్థితుల్లో ఆ పని చేయొద్దంటూ..

ABN , First Publish Date - 2023-09-14T07:53:05+05:30 IST

కువైత్‌ (Kuwait) లోని భారతీయ కార్మికులు, ఉద్యోగులకు రాయబార కార్యాలయం పాస్‌పోర్ట్ విషయమై తాజాగా కీలక సూచన చేసింది.

Indian Embassy in Kuwait: భారతీయ కార్మికులకు ఎంబసీ కీలక సూచన.. ఎట్టిపరిస్థితుల్లో ఆ పని చేయొద్దంటూ..

కువైత్ సిటీ: కువైత్‌ (Kuwait) లోని భారతీయ కార్మికులు, ఉద్యోగులకు రాయబార కార్యాలయం పాస్‌పోర్ట్ విషయమై తాజాగా కీలక సూచన చేసింది. భారతీయ కార్మికులు (Indian National Workers) తమ పాస్‌పోర్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో యజమానికి అప్పగించవద్దని ఇండియన్ ఎంబసీ (Indian Embassy) సూచించింది. తమ పాస్‌పోర్ట్స్‌ను వారి అధీనంలోనే ఉంచుకోవాలని తెలిపింది. రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. "భారత పాస్‌పోర్ట్ (Indian Passport) అనేది ఇండియన్ గవర్నమెంట్‌కి చెందిన సార్వభౌమ పత్రం, ఆస్తి. కువైత్‌లోని కార్మిక చట్టాలు కూడా ఎక్స్‌ప్రెస్‌తో తప్ప, ఉద్యోగుల పాస్‌పోర్ట్‌ను ఉంచుకోకుండా యజమానులను నిషేధిస్తున్నాయి. మీ పాస్‌పోర్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో మీ యజమానికి అప్పగించవద్దు. దయచేసి మీ పాస్‌పోర్ట్‌ను మీ వద్ద ఉంచుకోండి" అని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది.

Embsy-of-India.jpg

ఈ ప్రకటన ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రాయబార కార్యాలయానికి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఛానెల్స్‌లో ప్రచురించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Kuwait: వారం వ్యవధిలో 989 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

Updated Date - 2023-09-14T07:57:49+05:30 IST