Kuwait: వారం వ్యవధిలో 989 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2023-09-13T08:54:10+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గతకొంత కాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రవాసులు నివాసం ఉండే ప్రాంతాలలో తరచూ తనిఖీలు నిర్వహించడం చేస్తోంది.

Kuwait: వారం వ్యవధిలో 989 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గతకొంత కాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రవాసులు నివాసం ఉండే ప్రాంతాలలో తరచూ తనిఖీలు నిర్వహించడం చేస్తోంది. ఈ సోదాల్లో పట్టుబడిన వారిని దేశం నుంచి బహిష్కరిస్తోంది (Deported). ఇదే కోవలో తాజాగా 989 మంది ప్రవాసులపై దేశ బహిష్కరణ వేటు వేసింది. వీరు రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వీరిలో చాలా మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారితో పాటు కొందరు వేర్వేరు స్పాన్సర్ల వద్ద పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దేశ బహిష్కరణ పడిన 989 మందిలో 611 మంది పురుషులు, 378 మంది మహిళలు ఉన్నారు.

ఈ సందర్భంగా హర్బర్స్‌ (Harboring) లో పని చేస్తున్న ప్రవాస కార్మికులకు అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ పనిచేసే వారు చాలా మంది నివాస, కార్మిక చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కొంతకాలం కనిపించకుండాపోయి ఆ తర్వాత తమను తాము చట్టబద్ధంగానే దేశంలో ఉంటున్నట్లు చూపిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇకపై అలాంటి వారి ఆటలు కొనసాగవని వార్న్ చేశారు. వచ్చే రోజులలో తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పిన అధికారులు.. రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడేవారితో పాటు కనబడకుండా పోయేవారు, వాంటెడ్ పర్సన్స్‌ను ఎట్టిపరిస్థితులలో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అందుకే ప్రవాసులు (Expatriates) జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Kuwait’s New Residency Law: వీసా రెన్యువల్‌కు కొత్త షరతు.. ప్రవాసులు ఇకపై..

Updated Date - 2023-09-13T08:54:10+05:30 IST