Share News

Kuwait: కువైత్‌లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. వీకెండ్‌లో ఫ్రీ ఎంట్రీతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

ABN , First Publish Date - 2023-12-07T07:21:39+05:30 IST

కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు 'ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్' (Indian Community School Kuwait) గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది.

Kuwait: కువైత్‌లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. వీకెండ్‌లో ఫ్రీ ఎంట్రీతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

కువైత్ సిటీ: కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు 'ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్' (Indian Community School Kuwait) గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం ఈ వీకెండ్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది. వేదిక వచ్చేసి సాల్మియాలోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్, సీనియర్ బ్రాంచీ. ఇక ఈ ఉన్నత విద్యా మేళా అనేది భారతదేశం, విదేశాలలో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులు, విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ బిజినెస్ స్కూల్స్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలు, హెల్త్ సైన్సెస్, హ్యూమానిటీస్, మేనేజ్‌మెంట్ కాలేజ్, అర్కిటెక్చర్ అండ్ డిజైన్ కాలేజ్, లా కాలేజ్, కులినరీ ఆర్ట్స్, హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఇండియా మరియు విదేశాలలోని టూరిజం మేనేజ్‌మెంట్ యూనివర్సిటీస్ ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి.

ఇది కూడా చదవండి: Kuwait News: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. కువైత్‌లో ఉండగా ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే!

ఇక ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కువైత్‌లోని యువ భారతీయ ప్రవాసుల (Indian Expats) స్టడీస్ పరమైన అవసరాలను తీర్చడానికి వన్-స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇది విద్యార్థులు.. ఇండియా, విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ప్రతినిధులతో ముఖాముఖిగా కలుసుకోవడంతో పాటు అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వేదిక. అలాగే దరఖాస్తులపై వారి సలహాలు, సూచనలు పొందడానికి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. దీంతో పాటు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే కెరీర్ కన్సల్టెంట్లు వేదిక వద్ద విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో భాగంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కెరీర్ కోచ్‌ సజిత్ థామస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా నిర్వహించబడుతుంది. ఈ ఆప్టిట్యూడ్ పరీక్ష అనేది విద్యార్థులకు వారి భవిష్యత్ ఉద్యోగాలను వారి నైపుణ్య సెట్‌లకు మ్యాప్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పరీక్ష వంద శాతం పిల్లల యోగ్యత, ఆసక్తులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫెయిర్‌కు హాజరు కావాలనుకునే వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలి. రెండు రోజుల పాటు ఫెయిర్‌కు అందరికీ ప్రవేశం ఉచితం.

ఇది కూడా చదవండి: విషాదం.. స్విమ్మింగ్ పుల్‌లో మునిగి ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-07T07:25:15+05:30 IST