Share News

Expats: సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల రిక్రూట్‌మెంట్‌కు.. ప్రవాస ఉద్యోగి కనీస నెలవారీ వేతనం ఎంత ఉండాలంటే?

ABN , First Publish Date - 2023-10-11T09:43:47+05:30 IST

గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ కొత్త కండిషన్ పెట్టింది. ప్రవాసులు తమ సొంత జాతీయులను గృహ కార్మికులు (Domestic workers) గా రిక్రూట్ చేసుకోవడాన్ని నిషేధించింది.

Expats: సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల రిక్రూట్‌మెంట్‌కు.. ప్రవాస ఉద్యోగి కనీస నెలవారీ వేతనం ఎంత ఉండాలంటే?

రియాద్: గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ కొత్త కండిషన్ పెట్టింది. ప్రవాసులు తమ సొంత జాతీయులను గృహ కార్మికులు (Domestic workers) గా రిక్రూట్ చేసుకోవడాన్ని నిషేధించింది. గృహ కార్మిక సేవల కోసం ఏర్పాటైన ముసనేడ్ ప్లాట్‌ఫారమ్ (Musaned platform) ప్రకారం మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Social Development) కింద రిక్రూట్‌మెంట్ నిబంధనలు తమ స్వంత జాతీయతకు చెందిన గృహ కార్మికులను రిక్రూట్ చేసుకోవడానికి వీసా కోసం దరఖాస్తు చేయకుండా ప్రవాసులను (Expatriates) నిషేధించాయి. ప్రవాసులు వేరే దేశానికి చెందిన డొమెస్టిక్ వర్కర్లను రిక్రూట్ చేసుకోవాలని ఈ ప్లాట్‌ఫారమ్ పేర్కొంది. దీనిలో భాగంగా https://musaned.com.sa/terms/faq_reg లింక్‌ ద్వారా గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ నియమ నిబంధనలతో పాటు వీసాలు పొందేందుకు అవసరమైన ఆర్థిక పరిమితిని ప్రవాసులు చాలా సులువుగా తెలుసుకోవచ్చని చెప్పింది.

మొదటిసారిగా రిక్రూట్‌మెంట్ వీసా జారీ చేసినందుకు ప్రవాస ఉద్యోగికి కనీస వేతనం 10వేల సౌదీ రియాల్స్ (రూ.2.21లక్షలు) ఉండాలి. అలాగే 1లక్ష రియాళ్ల (రూ.22లక్షలు) విలువైన బ్యాంక్ పత్రాన్ని సమర్పించాలి. ఇక రెండవ వీసా జారీ చేసే సందర్భంలో తప్పనిసరిగా నివాసి ఉద్యోగికి కనీస జీతం రూ.4.42లక్షలతో పాటు రూ.44లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నెలవారీ వేతన ప్రకటనకు సంబంధించి జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (General Organization for Social Insurance) జారీ చేసిన సర్టిఫికేట్‌తో ప్రవాసులు తమ ఆర్థిక సామర్థ్యాన్ని రుజువు చేయాలి. అలాగే వీసా కోసం దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 60 రోజులకు మించకుండా రుజువు చేసుకోవాలి. కాగా, మంత్రిత్వ శాఖ ముసనేడ్ ప్లాట్‌ఫారమ్‌ను గృహ సేవలు మరియు గృహ ఉపాధి కార్యక్రమాల కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌గా ఏర్పాటు చేసింది. ఇది రిక్రూట్‌మెంట్ విధానాన్ని మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి వివిధ సేవలను అందిస్తుంది.

UAE: గోల్డెన్ వీసాతో కలిగే ఎనిమిది అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..

Updated Date - 2023-10-13T12:24:07+05:30 IST