Dubai: 4ఏళ్ల క్యాన్సర్ రోగి కోరిక తీర్చి.. పెద్ద మనసు చాటిన దుబాయి రాజకుటుంబం..!

ABN , First Publish Date - 2023-09-19T12:03:52+05:30 IST

దుబాయ్ రాజకుటుంబాని (Dubai Royal Family) కి చెందిన సభ్యుడు ఒకరు పెద్ద మనసు చాటారు. క్యాన్సర్‌‌తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చారు.

Dubai: 4ఏళ్ల క్యాన్సర్ రోగి కోరిక తీర్చి.. పెద్ద మనసు చాటిన దుబాయి రాజకుటుంబం..!

ఎన్నారై డెస్క్: దుబాయ్ రాజకుటుంబాని (Dubai Royal Family) కి చెందిన సభ్యుడు ఒకరు పెద్ద మనసు చాటారు. క్యాన్సర్‌‌తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చారు. షార్జా (Sharjah) లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో లుకేమియా (Leukemia) తో చికిత్స పొందుతున్న హందాన్ (Hamdan) అనే నాలుగేళ్ల బాలుడిని దుబాయ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడు షేక్ బుట్టి అల్ సయీద్ అల్ మక్తూమ్ (Sheikh Butti Al Saeed Al Maktoum) పరామర్శించారు. మార్చిలో హందాన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ మరుసటి నెల నుంచే చిన్నారికి కెమెథెరపీ సెషన్స్ (Chemotherapy sessions) మొదలెట్టారు వైద్యులు.

ఈ క్రమంలో వైద్యానికి ఎంతో చక్కగా సహకరిస్తున్న హందాన్‌ను డాక్టర్లు నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం.. ఏం కావాలో అడగాలని కోరారు. దానికి బాలుడు తనకు ఒకసారి దుబాయ్ రాజకుటుంబాన్ని కలవాలని ఉందని చెప్పాడు. దాంతో హందాన్ కోరికను ఆస్పత్రి వైద్యులు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ సంస్థ (The Emirates Red Crescent organisation) ద్వారా దుబాయ్ రాయల్ ఫ్యామిలీకి చేర్చారు. బాలుడి కోరికను తెలుసుకున్న రాజకుటుంబం తమ ఫ్యామిలీ మెంబర్‌ను హందాన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పంపించడం జరిగింది.

Dubai-Royal.jpg

ఆ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షేక్ బుట్టి నేరుగా హాస్పిటల్‌కి వచ్చి హందాన్‌ను పరామర్శించారు. బాలుడి కోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. త్వరలోనే అతడు కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక తనను కలవడానికి రాయల్ ఫ్యామిలీ మెంబర్ రావడంతో హందాన్ ఆనందానికి అవధుల్లేవు. తమ కోరినను మన్నించి.. తమకు ధైర్యం చెప్పేందుకు రాజకుటుంబానికి చెందిన వ్యక్తి రావడం పట్ల హందాన్ తల్లి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

UAE-India travel: భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు.. పైగా 200కేజీల వరకు లగేజీకి అనుమతి

Updated Date - 2023-09-19T12:03:52+05:30 IST